
విభజన చట్టం ప్రకారం ఇంత వరకు నిధులు కేటాయించలేదు… ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు.. నిధులు అడిగితే… నిమ్మకుండిపోతున్నారు.. ఇప్పడు బడ్జెట్ లోనూ అసలు ఆంధ్రప్రదేశ్ ఊసేలేదు. ఏపీ భారతదేశంలో భాగం కాదా.. అంటూ.. వైసీపీ ఎంపీలు గళమెత్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వేదికగా.. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశను మిగిల్చిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ లో ఏపీపై సవతి ప్రేమ చూపిందని కడిగేశారు. త్వరలో ఎన్నికలు జరగబోయే ఆ నాలుగు రాష్ట్రాలపైనే ప్రేమ వలకబోశారని.. వరాలు కురిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు ఇది దేశానికి బడ్జెట్ లా లేదని.. తమిళనాడు.. కేరళా.. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ర్టాల బడ్జెట్ లా ఉందని విజయసాయి రెడ్డి విమర్శించారు. విశాఖపట్నం, విజయవాడ కోసం మెట్రో రైలు ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం దారుణమని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు లేవనెత్తినా.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ప్రస్తావించిన ఒక్క రైల్వే ప్రాజెక్టుకు కూడా ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయించలేదని.. రాష్ట్రాన్ని కలిపే.. ఏకైక కారిడార్ మంజూరు చేశారని.. ఇది రాష్ర్టానికి ఏ మాత్రం ఉపయోగపడదని అన్నారు. కిసాన్ రైళ్ల విషయంలో రాష్ట్ర ప్రస్తావనే లేదని అన్నారు.
ఆరేళ్లుగా రాష్ట్రానికి మెట్రో రైలు ప్రాజెక్టును మంజూరు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోరినా.. బడ్జెట్ లో పెడచెవిన పెట్టారని విజయసాయి రెడ్డి విమర్శించారు. ఎన్నిసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినా.. కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని.. అన్నారు. చెన్నై, కొచ్చి, బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్టులకు భారీగా నిధులు మంజూరు చేశారని అన్నారు. విమర్శించారు.
అయితే కేంద్రంలో బీజేపీ అంటే భయపడేవారుగా వైసీపీకి పేరును ఆపాదించింది తెలుగుదేశం పార్టీ.. కేంద్రంలో ఉన్న మోదీ.. అమిత్ షాలకు జగన్ భయపడుతున్నారని.. అందుకే వారికి మద్దతిస్తున్నారని.. ప్రతీ బీజేపీ బిల్లుకు కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించేవారు. ఇప్పటి వరకు బీజేపీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఏ బిల్లు, ప్రతిపాదనలకు ఏపీలోని వైసీపీ వ్యతిరేకించలేదు. కానీ బడ్జెట్ కేటాయింపు విషయంలో మొండిచేయి చూపించారని.. కేంద్రం శివాలెత్తింది వైసీపీ.