https://oktelugu.com/

దారుణంగా బిగ్ బాస్ షో రేటింగ్స్.. షాక్ లో నిర్వాహకులు..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోకు భారీ షాక్ తగిలింది. బిగ్ బాస్ సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ కు 18.5 టీఆర్పీ రేటింగ్ రాగా ఆ రేటింగ్ క్రమంగా తగ్గుతోంది. మిగతా సీజన్ల రేటింగులతో పోల్చి చూస్తే సీజన్ 4 రేటింగ్ మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ షో ప్రారంభమై ఏడు వారాలు కాగా ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు ఒక రకంగా ఘోరమైన రేటింగులు రావడానికి కారణమవుతున్నారు. మరోవైపు టాస్క్ లు కూడా పెద్దగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 21, 2020 / 03:59 PM IST
    Follow us on

    బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోకు భారీ షాక్ తగిలింది. బిగ్ బాస్ సీజన్ 4 లాంఛింగ్ ఎపిసోడ్ కు 18.5 టీఆర్పీ రేటింగ్ రాగా ఆ రేటింగ్ క్రమంగా తగ్గుతోంది. మిగతా సీజన్ల రేటింగులతో పోల్చి చూస్తే సీజన్ 4 రేటింగ్ మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ షో ప్రారంభమై ఏడు వారాలు కాగా ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు ఒక రకంగా ఘోరమైన రేటింగులు రావడానికి కారణమవుతున్నారు. మరోవైపు టాస్క్ లు కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

    ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లను పరిశీలిస్తే వాళ్లలో తెలిసిన కంటెస్టెంట్లతో పోలిస్తే తెలియని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నారు. మరోవైపు లవ్ టాస్కులు కూడా బిగ్ బాస్ షోకు మైనస్ గా మారాయి. మోనాల్ ఎక్స్ ఫోజింగ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను బిగ్ బాస్ షోకు దూరంగా ఉండటం గమనార్హం. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలు, హగ్గులు ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చడం లేదు. మరోవైపు లీకేజీలు బిగ్ బాస్ షోకు చేటు చేస్తున్నాయి.

    ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారో ముందే తెలిసిపోతూ ఉండటంతో ప్రేక్షకులకు షోపై ఆసక్తి ఏర్పడటం లేదు. వీకెండ్స్ లో 11 రేటింగ్ రాగా వీక్ డేస్ లో బిగ్ బాస్ రేటింగ్ 8.35 మాత్రమే ప్రేక్షకులు ఈ షోను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సులువుగానే అర్థమవుతుంది. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లోకి కొత్త వఈల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండవని తెలుస్తోంది. మరోవైపు మోనాల్ ని బిగ్ బాస్ సేవ్ చేస్తున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

    గత సీజన్లలా ఈ సీజన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచలేకపోయింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపికలోనే లోపం ఉండటంతో ఈ షోను రక్షించడం కష్టమే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున షూటింగ్ పని మీద విదేశాలకు వెళ్లాడని.. ఈ వారం నాగార్జున బదులుగా మరో హోస్ట్ రానున్నారని సమాచారం.