ఏపీలో ప్రారంభమైన వైఎస్సార్ బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కొత్త స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌ బీమా పథకం అమలు ద్వారా రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కోసం 583 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని.. కోటీ 41 లక్షల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు […]

Written By: Kusuma Aggunna, Updated On : October 21, 2020 3:54 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కొత్త స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌ బీమా పథకం అమలు ద్వారా రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కోసం 583 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుందని.. కోటీ 41 లక్షల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనుందని తెలుస్తోంది.

రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు వాళ్లు ఈ పథకానికి అర్హులవుతారు. అయితే ఈ స్కీమ్ లో 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు, 51 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లకు నియమ నిబంధనలు వేరుగా ఉన్నాయి. 18 – 50 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు పూర్తిగా అంగ వైకల్యం పొందినా, ప్రమాదవశాత్తూ మృతి చెందినా 5 లక్షల రూపాయలు, సహజ మరణం పొందితే 2 లక్షల రూపాయలు నామినీకి ఇస్తారు.

51 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ప్రమాదవశాత్తూ మృతి చెందినా, శాశ్వత అంగవైకల్యం పొందినా 3 లక్షల రూపాయం ప్రభుత్వం నుంచి పొందవచ్చు. 18 – 70 ఏళ్ల మధ్య వయస్సు వాళ్ల పాక్షిక అంగవైకల్యం పొందితే లక్షన్నర రూపాయలు ప్రభుత్వం నుంచి బీమా పరిహారంగా అందుతుంది. వాలంటీర్లు లబ్ధిదారులను సర్వే ద్వారా ఎంపిక చేస్తారు. ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసేవాళ్లకు బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఉండాలి.

వీళ్లు ఏడాదికి 15 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ఏడాదికి 15 రూపాయల చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉండగా ఆధార్ కార్డును బట్టి వయస్సును నిర్ధారిస్తారు. క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల్లో బీమా డబ్బులు ఖాతాలో జమవుతాయి.