ప్రపంచానికి పెద్దన్న కావడంతో అమెరికా ఎన్నికలపై ఆ దేశానికే కాకుండా ప్రపంచానికి ఆసక్తి ఉంటుంది. ఈరోజుల్లో అగ్రరాజ్యం ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహిస్తుందోనని సామాన్యులు కూడా టీవీల ముందు కూర్చొని చూస్తున్నారు. అమెరికా ఎన్నికల ప్రభావం కొన్ని దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఆయా దేశాలు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాయి. ముఖ్యంగా భారతదేశం అమెరికాతో సత్సంబంధాలు నిత్యం కొనసాగించాలి కాబట్టి అధ్యక్షుడు ఎవరనేది తెలుసుకోవడం అత్యవసరం. ప్రతీ నాలుగేళ్లకోసారి నిర్వహించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లోనే నిర్వహిస్తారు. అదీ మంగళవారం రోజునే పోలింగ్ ప్రక్రియ మొదలుపెడుతారు. ఈ విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే అమెరికా నవంబర్‌లోనే ఎన్నికలు నిర్వహించడానికి కారణమేంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపుతున్నారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు
1845 సంవత్సరానికి ముందు అమెరికాలో తమ వీలును బట్టి ఎన్నికలు నిర్వహించుకునే వారు. డిసెంబర్ నెల మొదటి బుధవారానికి ముందు 34 రోజుల లోపల ఆయా రాష్ట్రాలో వీలును బట్టి ఎన్నికలు నిర్వహించేవారు. అయితే ఈ విధానం వల్ల అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత లేకపోవడంతో పాటు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా ఒకే తేదీన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. అలా 1845లో అప్పటి ప్రభుత్వం నవంబర్ నెలలో వచ్చే తొలి మంగళవారం పోలింగ్ రోజుగా ప్రకటించింది. అప్పటి నుంచి ఏ ఎన్నికలు చూసినా నవంబర్ 2న పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది.
Also Read: ట్రంప్ ఓటమికి.. మోడీకి లింకెంటీ?
అప్పట్లో పట్టణాల కంటే గ్రామీణ జనాభా ఎక్కువ కావడంతో వారిని దృష్టిలో పెట్టుకున్న అమెరికా వారికి అనుకూలంగా ఎన్నికలు నిర్వహిస్తోంది. చాలా ఏరియాల్లో గ్రామాల్లో జీవనం కొనసాగించేవారే ఎక్కువగా ఉన్నారు. ఓటు వేయడానికి వారు ఆసక్తి చూపించరు. అంతేకాకుండా రవాణా వ్యవస్థ సరిగా ఉండదు. దీంతో పోలింగ్ శాతం పెరగడానికి నవంబర్ నెలను నిర్ణయించుకున్నారు. గ్రామాల్లో వ్యవసాయం చేసేవారు జూలై నుంచి అక్టోబర్ మధ్య పంటను తీస్తారు. నవంబర్ వరకు తమ పంటలను విక్రయిస్తారు. ఆ తరువాత వారు రిలాక్స్‌డ్‌గా ఉంటారు. అందువల్ల నవంబర్ నెలలో ప్రచారం నిర్వహించినా, ఓటింగ్ ప్రక్రియ చేపట్టినా పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది.
Also Read: కుట్రలు, కుతంత్రాలు సాగుతున్నా ఆగని పోలవరం పనులు
కాగా రైతులు పండించిన పంటలను బుధవారం రోజు మార్కెట్లలో విక్రయిస్తారు. ఆరోజున వ్యాపారం జరిగే రోజు కాబట్టి ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు. దీంతో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయి. శుక్ర, శనివారాలు వారంతపు సెలవులు కావడంతో ఉద్యోగులు ఓటేయ్యడానికి రారు. ఆదివారం ప్రజలంతా చర్చిలో ప్రార్థనలు చేసి సరదాగా ఉంటారు. ఆ సమయంలో పోలింగ్ నిర్వహించడం కష్టం. అందువల్ల నవంబర్ నెలలో మొదటి మంగళవారంలో పోలింగ్ నిర్వహించాలని ఆనాడు అధికారులు నిర్ణయించారు. ఓటేయ్యడానికి సోమవారం రాత్రి వరకు ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని మంగళవారం మొత్తం పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండడంతో మంగళవారం నాడు పోలింగ్ ప్రక్రియ చేపట్టాలని అమెరికా ప్రభుత్వం గతంలో నిర్ణయించిందని చరిత్ర చెబుతోంది..