టాలీవుడ్లోని అగ్ర దర్శకుల రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అపజయాల్లేకుండా అప్రహతీతంగా దూసుకెళుతున్న రాజమౌళి ఇండియాలోనే టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఆయన తర్వాత టాలీవుడ్లో దర్శకుడు త్రివిక్రమ్.. ఆ తర్వాత స్థానం దర్శకుడు కొరటాల శివ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా?
దర్శక దిగ్గజం రాజమౌళి రేంజ్ టాలీవుడ్ ను మించి నేషనల్ లెవల్ కు చేరింది. ఆయన పారితోషికం కన్నా సినిమా బిజినెస్ లో షేర్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. దీంతో ఆయన రెమ్యూనరేషన్ టాలీవుడ్ దర్శకులకు అందనంత ఎత్తులో ఉంటుంది. రాజమౌళి తర్వాత టాలీవుడ్లో అత్యధిక పారితోషకం అందుకున్న దర్శకుడిగా త్రివిక్రమ్ పేరు విన్పిస్తోంది.
దర్శకుడు త్రివిక్రమ్ ఇటీవల ‘అలవైకుంఠపురములో’ మూవీతో ఇండస్ట్రీ హిట్టు అందుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ తన పారితోషికాన్ని 20కోట్లకు పెంచేశాడట. త్రివిక్రమ్ సైతం అప్పుడప్పుడు సినిమా షేర్స్ తీసుకుంటాడని సమాచారం. ఇక ఆయన తర్వాత అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడిగా కొరటాల పేరు విన్పిస్తోంది.
Also Read: బిగ్‌బాస్ ఫైనల్ విన్నర్ అతనేనా..?
దర్శకుడు కొరటాల శివ వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్నాడు. అపజయాల్లేకుండా దూసుకెళుతూ రెమ్యూనేషన్ ను పెంచుతూ పోతున్నారు. కొరటాల శివ-అల్లు అర్జున్ కాంబినేషన్లలో తెరకెక్కనున్న మూవీ కోసం కొరటాల ఏకంగా రూ.15కోట్లు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత రాంచరణ్ తో ఓ మూవీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి.. అల్లు అర్జున్ సినిమాలు హిట్టయితే మాత్రం కొరటాల శివ రెమ్యూనరేషన్లో త్రివిక్రమ్ ను ఓవర్ టేక్ చేయడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. రచయితగా వేలల్లో పారితోషికం తీసుకునే కొరటాల డైరెక్టర్ గా కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుండటం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్