వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. ఎలా యాక్టివేట్ చేయాలంటే..?

స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఒకటైన వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది. చాలా రోజుల నుంచి వాట్సాప్ యూజర్లు డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ను వినియోగించుకోవడం ద్వారా వాట్సాప్ లో మెసేజ్ ఏడు రోజుల తర్వాత డిలేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్, […]

Written By: Navya, Updated On : December 6, 2020 8:09 pm
Follow us on


స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా ఉపయోగించే అప్లికేషన్లలో ఒకటైన వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువ అవుతోంది. చాలా రోజుల నుంచి వాట్సాప్ యూజర్లు డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్ ను వినియోగించుకోవడం ద్వారా వాట్సాప్ లో మెసేజ్ ఏడు రోజుల తర్వాత డిలేట్ చేసే ఛాన్స్ ఉంటుంది.

ఆండ్రాయిడ్, ఐఫోన్, వెబ్ వాట్సాప్ లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ అదిరిపోయే ఫీచర్ ను కొన్ని స్టెప్స్ పాటించడం ద్వారా సులభంగా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. వాట్సాప్ లో డిజప్పియరింగ్ మెసేజ్‌ ఫీచర్ ను వినియోగించుకోవాలనుకునే కస్టమర్లు మొదట వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత చాట్ విండోను సెలెక్ట్ చేసుకొని కాంటాక్ట్ నేమ్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఆ తరువాత డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ను ఎంచుకుని ఎనేబుల్ చేయడం ద్వారా వారం రోజుల తరువాత వాట్సాప్ యాప్ లో మెసేజెస్ డిలేట్ అవుతాయి. ప్రతిరోజు చాట్ ను డిలేట్ చేయడం కష్టమైతే ఈ ఫీచర్ సహాయంతో సులభంగా వాట్సాప్ మెసేజ్ లను డిలేట్ చేయవచ్చు. ఈ ఫీచర్ తో పాటు వాట్సాప్ ఈ మధ్య కాలంలో మరికొన్ని కొత్త ఫీచర్లను సైతం అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫీచర్ తో పాటు వాట్సాప్ చాటింగ్ చేసే సమయంలో ప్రతి చాట్ పేజీకి ఒక కొత్త వాల్ పేపర్ ను సెట్ చేసుకునే ఫీచర్ ను సైతం అందుబాటులోకి తెచ్చింది. వాల్ పేపర్ గ్యాలరీ అనే అప్ డేట్ ను వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ల ద్వారా యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.