బడ్జెట్ అంటే ఏమిటి..? దానిని ఎందుకు తయారు చేస్తారు..?

భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభుత్వం రూపొందించే బడ్జెట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రతీ సంవత్సరం దేశ ఆర్థిక అవసరాలు, ఖర్చులను బేరీజు వేసుకొని రూపొందించిన బడ్జెట్ ఆధారంగానే దేశం ముందుకు పోతుంది. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ను మార్చిలో ప్రవేశపెట్టేవారు. కానీ దానిని ఫిబ్రవరి నెలకు మార్చారు. సోమవారం కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. కేంద్ర బడ్జెట్ పై దేశంలోని యావత్తు […]

Written By: NARESH, Updated On : February 1, 2021 9:57 am
Follow us on

భారత ఆర్థిక వ్యవస్థ అనేది ప్రభుత్వం రూపొందించే బడ్జెట్ పై ఆధారపడి ఉంటుంది. ప్రతీ సంవత్సరం దేశ ఆర్థిక అవసరాలు, ఖర్చులను బేరీజు వేసుకొని రూపొందించిన బడ్జెట్ ఆధారంగానే దేశం ముందుకు పోతుంది. ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్ ను మార్చిలో ప్రవేశపెట్టేవారు. కానీ దానిని ఫిబ్రవరి నెలకు మార్చారు. సోమవారం కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. కేంద్ర బడ్జెట్ పై దేశంలోని యావత్తు ప్రజానీకం దృష్టి పెడుతోంది. అయితే కొందరికి బడ్జెట్ పై పూర్తిగా అవగాహన లేదు. కానీ బడ్జెట్ రూపకంగానే దేశంలో ధరలు, ఇతర ఖర్చులు ఉంటాయన్న విషయం నిజం. ఇంతకీ బడ్జెట్ ను ఎలా ప్రవేశపెడుతారు..? అనే విషయాలపై..

కేంద్ర బడ్జెట్ ను రూపొందించే ఐదు నెలల ముందు నుంచే ఆ శాఖకు సంబంధించిన అధికారులు పని మొదలు పెడుతారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తమకు అవరసమయ్యే ఆర్థిక అవసరాలు, ఇతర నిధులను కోరే పత్రాలను సమర్పించాల్సిందిగా తెలుపుతారు. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలి..? ఏ రంగానికి ఎంత ఖర్చు పెట్టాలి..? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఆదాయం రాబట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తావిస్తారు.

కేంద్ర బడ్జెట్ దేశం మొత్తానికి అవసరం. అందుకు బడ్జెట్ సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఓ బుక్ లా తయారు చేస్తారు. కానీ ఈసారి కరోనా కారణంగా పేపర్లు ముద్రించలేదు. ఓ యాప్ ను రూపొందించి అందులో సమాచారాన్ని పెట్టారు. అయితే దీనిని తయారు చేసే ముందు సంబంధిత అధికారులను ఓ నివాసంలో ఉంచుతారు. వారు ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు అక్కడి నుంచి బయటకు రారు. ఎలాంటి చిన్న సమాచారం బయటపడకుండా జాగ్రత్తపడుతారు.

ఇక బడ్జెట్ కు ఒక రోజు ముందు నిర్వహించిన ఆర్థిక సర్వేను బయటపెడుతారు. సంవత్సరం మొత్తం పెట్టిన ఖర్చులు, ఆదాయం, పొదుపుకు సంబంధించిన లెక్కలను ఇందులో వివరిస్తారు. ఒకవేళ ఆదాయం తగ్గితే ఏం చేయాలనే విషయాన్ని ఇందులో చెబుతారు. మొదటి ఆర్థిక సర్వేను 1950-51లో సమర్పించారు.

అనంతరం బడ్జెట్ కు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి చదివి వాటికి ఆమోద ముద్ర వేస్తారు. ఆయన ఆమోదం లేనిదే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వీలు లేదు. ఆ తరువాత పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ ను చదివి దేశ ప్రజలకు వినిపిస్తారు. ఆ తరువాత దీనిపై రెండు రోజులు సమావేశాలు ఉంటాయి. ఇందులో విధి విధానాలు ప్రకటిస్తారు.