
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడటం జరుగుతుంది. వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడితే కంపెనీ వారంటీ కూడా పని చేయదు. అయితే ఫోన్ నీళ్లలో పడిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మొబైల్ ను పాడు కాకుండా కాపాడుకోవచ్చు. అనవసర ప్రయోగాలు చేయకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే డబ్బులు ఖర్చు చేయకుండా ఫోన్ బాగవుతుంది.
Also Read: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ రుణాలపై అదిరిపొయే ఆఫర్లు..?
స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడితే ఫోన్ పై ఉన్న బటన్స్ ను ప్రెస్ చేయడం, ఫోన్ ను ఆన్ చేయడం చేయకూడదు. నీళ్లలో పడే సమయానికి మొబైల్ ఫోన్ ఆన్ లో ఉంటే వెంటనే స్విఛాఫ్ చేయాలి. ఆ తరువాత స్మార్ట్ ఫోన్ నుంచి సిమ్ కార్డులను, మెమెరీ కార్డులను తీసివేయాలి. మీ స్మార్ట్ ఫోన్ నుంచి బ్యాటరీని తీసివేసే ఛాన్స్ ఉంటే బ్యాటరీని కూడా తీసివేయడం మంచిది. ఆ తరువాత ఒక కవర్ లో బియ్యం తీసుకుని ఫోన్ ను పూర్తిగా కప్పేసి గాలి తగలకుండా క్లోజ్ చేయాలి.
Also Read: ఉసిరికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..?
బియ్యానికి నీటిని పీల్చే శక్తి ఉండటం వల్ల బియ్యం మొబైల్ లోని తేమను పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఒకరోజంతా అలా ఉంచి ఆ తరువాత ఫోన్ లో సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ ను వేస్తే మొబైల్ ఫోన్ యథాతథంగా పని చేసే అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ నీటిలో పడితే వెంటనే ఛార్జింగ్ మాత్రం పెట్టకూడదు. ఫోన్ పై గట్టిగా గాలి ఊదటం చేయకూడదు. ఫోన్ ను ఎండకు పెట్టడం, మంట దగ్గర ఉంచడం లాంటి పనులు అస్సలు చేయకూడదు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అన్ని టిప్స్ సరిగ్గా పాటించినా మొబైల్ ఫోన్ ఆన్ కాకపోతే సమీపంలోని సర్వీస్ సెంటర్ కు వెళ్లి చూపించాలి. చాలావరకు ఒకరోజంతా బియ్యంలో ఉంచడం వల్ల స్మార్ట్ ఫోన్ పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.