https://oktelugu.com/

కేసీఆర్ పాలన-దొరల పాలన:కిషన్ రెడ్డి

లాక్ డౌన్ కారణంగా కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజిపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన విమర్శలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కరోనా సంక్షోభ సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కేసీఆర్ భాష కూడా సరిగా లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.దేశంలో సంస్కరణలు […]

Written By: , Updated On : May 19, 2020 / 02:22 PM IST
Follow us on

లాక్ డౌన్ కారణంగా కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజిపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన విమర్శలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దొరల పాలన నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కరోనా సంక్షోభ సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

కేసీఆర్ భాష కూడా సరిగా లేదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.దేశంలో సంస్కరణలు రావాలని, ఒకే దేశం,ఒకే కార్డ్ విదానం అమలు కావాలని ఆయన తెలిపారు. తాత్కాలికమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ కష్ట సమయంలో ఆలోచన చేయడం సరికాదన్నారు. దేశ హితం కోసం తెచ్చిన ఆర్థిక ప్యాకేజీ అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరమన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఒక్క రూపాయి దుర్వినియోగమైందా? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతోందో కేసీఆర్ వివరించాలన్నారు. తాము తప్ప ఏపార్టీ ఉండకూడదనే సంకుచిత ధోరణిలో కెసిఆర్ ఉన్నారని, ఆయనది దొరల పాలన అని కిషన్ రెడ్డి ద్వజమెత్తారు.