https://oktelugu.com/

వైరల్ : లక్ష్మీపార్వతి ఇంట చిన్న ఎన్టీఆర్ వచ్చాడు!

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ కొడుకులు, మనవళ్లు, ఆయన భార్య లక్ష్మీపార్వతిలు ఘాట్ ను సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడ్డారని లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కేంద్రంపై ఒత్తిడి చేసి ఉంటే ఎప్పుడో వచ్చేదన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 18, 2021 / 07:18 PM IST
    Follow us on

    ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ కొడుకులు, మనవళ్లు, ఆయన భార్య లక్ష్మీపార్వతిలు ఘాట్ ను సందర్శించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా సొంత కుటుంబ సభ్యులే అడ్డుపడ్డారని లక్ష్మీపార్వతి తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కేంద్రంపై ఒత్తిడి చేసి ఉంటే ఎప్పుడో వచ్చేదన్నారు.

    ఇప్పటికైనా సీఎం జగన్ ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం జగన్ ను కోరుతానని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.

    జగన్ మోహన్ రెడ్డి పాలన రామరాజ్యంలా కొనసాగుతోందని లక్ష్మీపార్వతి ప్రశంసల్లో ముంచెత్తారు. తనకు మనవడు పుట్టాడని.. మా ఇంట్లోకి చిన్న ఎన్టీఆర్ వచ్చినట్టు ఉందని ఆమె తెలిపారు. జనవరి 1న పుట్టిన ఆ బాబుకు అప్పుడే తాను ఎన్టీఆర్ అని పేరు పెట్టానన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆ బాబును పెంచాలనుకుంటున్నట్టు లక్ష్మీపార్వతి తెలిపారు.

    దివంగత ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై లక్ష్మీపార్వతి ఘాటు విమర్శలు చేశారు. ఒక్కరు కూడా ఎన్టీఆర్ ను అర్థం చేసుకోలేదని.. ఒక్క హరికృష్ణ మాత్రమే తనను అమ్మా అని పిలిచివారని అన్నారు.

    ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే ఆయన భార్యగా తాను అందుకుంటానన్న కుట్రతోనే ఆ అత్యున్నత పురస్కారం రాకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలున్నాయి.