
ఇంతింతై.. వటుడింతై అన్నట్టుగా నాన్న మరణంతో కాంగ్రెస్ ను ఎదురించి పార్టీ స్థాపించిన వైఎస్ జగన్ ఇంత ఎత్తుకు ఎదుగుతాడని.. రాష్ట్ర సీఎం అవుతాడని ఆయన ఊహించలేదు. వైసీపీ కార్యకర్తలు, నేతలు కూడా మొదట్లో అనుకోలేదు. కానీ పార్టీని 11 ఏళ్లలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనుడు వైఎస్ జగన్. అందుకే ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నానంటూ వైసీపీ వార్షికోత్సవం వేళ తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఎమోషనల్ అయ్యారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 11వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్భంగా గతం తాలూకూ జ్ఞాపకాలను జగన్ గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ‘మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా, విలువలు విశ్వసనీయతల పునాదులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. ఈ పదేళ్ల ప్రయాణంలో కష్ట సుఖాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, నాతో కలిసి నడిచిన నాయకులకు, నా వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.’ అంటూ జగన్ తన వెంట నడిచిన వారిని మరిచిపోకుండా గుర్తు చేసుకున్నాడు.
ఇప్పటికీ జగన్ తన వెంట పదేళ్లుగా ఉన్న వారికే పదవుల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. తాను హామీనిచ్చిన వారినే గద్దెనెక్కిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం వేళ మరోసారి దాన్ని గుర్తు చేసుకున్నారు.
Comments are closed.