https://oktelugu.com/

వన్‌ అండ్‌ ఓన్లీ విజయ్ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ. టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలోనే ఓ సెన్సేషన్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టాడు. కన్నుమూసి తెరిసేలోగా స్టార్ అయిపోయాడు. అతి తక్కువ కాలంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు. మరోవైపు సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ సెలబ్రిటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సౌత్ తారలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. మన విజయ్ దేవరకొండ కూడా సోషల్‌ మీడియాలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 17, 2020 / 02:04 PM IST
    Follow us on


    విజయ్‌ దేవరకొండ. టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలోనే ఓ సెన్సేషన్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టాడు. కన్నుమూసి తెరిసేలోగా స్టార్ అయిపోయాడు. అతి తక్కువ కాలంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు. మరోవైపు సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ సెలబ్రిటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సౌత్ తారలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. మన విజయ్ దేవరకొండ కూడా సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్నాడు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాలో విజయ్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య అక్షరాలా 8 మిలియన్ల మార్క్ దాటింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు. విజయ్ తర్వాత అల్లు అర్జున్ 7.6 మిలియన్‌ ఫాలోవర్స్‌తో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. మహేష్ బాబు (5.2 మిలియన్స్), ప్రభాస్ (4.8 మిలియన్స్), రానా (4 మిలియన్స్) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

    ఎక్స్ క్లూజివ్ : కవలలుగా మహేష్ బాబు..!

    ‘పెళ్లి చూపులు’తో హీరోగా పరిచయం అయిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో ఓవర్నైట్‌ స్టార్ అయిపోయాడు. ఈ మూవీతో తెలుగు వారినే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌ రెడ్డి హిందీలో రీమేక్‌ అయిన తర్వాత విజయ్‌ సినిమాలన్నీ హిందీలో డబ్ అయ్యాయి. దాంతో, విజయ్‌కు దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్‌ పెరిగారు. అందదుకే, ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న మహేశ్‌, ప్రభాస్, బన్నీ కంటే కూడా విజయ్‌కే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండడం చూస్తుంటే యూత్‌లో అతని క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. దీనికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ రిలీజైతే విజయ్‌ స్టార్డమ్‌ మరింత పెరిగే చాన్సుంది.

    ‘డర్టీ హరి’.. మాటల్లేవ్‌… ముద్దులే!