https://oktelugu.com/

నాని ‘వి’ మూవీ రివ్యూ

మూవీ : ‘వి’ విడుదల తేదీ: సెప్టెంబర్‍ 5, 2020 వేదిక: అమెజాన్‍ ప్రైమ్‍ వీడియో బ్యానర్‍: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తారాగణం: నాని, సుధీర్‍బాబు, అదితిరావ్‍ హైదరి, నివేదా థామస్‍, నరేష్‍, వెన్నెల కిషోర్‍ తదితరులు సంగీతం: అమిత్‍ త్రివేది ఎడిటింగ్ : మార్తాండ్‍ కె. వెంకటేష్‍ నిర్మాతలు: రాజు-శిరీష్‍-హర్షిత్‍ రెడ్డి రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ నాని 25వ సినిమాగా ‘వి’ చిత్రం ఈరోజు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాని తొలి సినిమా దర్శకుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 10:59 AM IST
    Follow us on

    మూవీ : ‘వి’
    విడుదల తేదీ: సెప్టెంబర్‍ 5, 2020
    వేదిక: అమెజాన్‍ ప్రైమ్‍ వీడియో
    బ్యానర్‍: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    తారాగణం: నాని, సుధీర్‍బాబు, అదితిరావ్‍ హైదరి, నివేదా థామస్‍, నరేష్‍, వెన్నెల కిషోర్‍ తదితరులు
    సంగీతం: అమిత్‍ త్రివేది
    ఎడిటింగ్ : మార్తాండ్‍ కె. వెంకటేష్‍
    నిర్మాతలు: రాజు-శిరీష్‍-హర్షిత్‍ రెడ్డి
    రచన, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

    నాని 25వ సినిమాగా ‘వి’ చిత్రం ఈరోజు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాని తొలి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణనే ‘వి’ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయాలని ప్రయత్నించినా కరోనా కారణంగా చివరకు ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు ‘వి’ని కొనుగోలు చేసి నేడు విడుదల చేసింది. అయితే ‘వి’ సినిమా అంచనాలను అందుకుందా? లేదా అనేది చూద్దాం.

    *కథ ఏంటి?
    హీరో నాని తాను చేయని ఓ మాస్ క్యారెక్టర్లో కన్పించాడు. రఫ్ అండ్ టఫ్ లుక్కులో అదిరిపోయాడు. అయితే ఈ సినిమా కథాంశాన్ని దర్శకుడికి కొత్తమోగానీ తెలుగులో ఇలాంటి కంటెంట్ సినిమాలు వచ్చాయి. హీరో నాని ఎంట్రీలోనే ఓ స్టైల్ ఆఫ్ స్మోకింగ్ చేస్తూ కన్పిస్తాడు. ఎంట్రీలోనే మర్డర్ చేసి ఓ పోలీస్ ఆఫీసర్ కు తనను పట్టుకో అంటూ సవాల్ విసురుతాడు. ఇలా హీరో మర్డర్లు చేసుకుంటూ సదరు పోలీస్ ఆఫీసర్ కు క్లూ ఇస్తూ పోతుంటాడు. ఇలాంటి రోటీన్ కథలు తెలుగులో బోలెడన్నీ వచ్చాయి.

    Also Read: ‘మిస్ ఇండియా’ రేటు 38 కోట్లు !

    *విశ్లేషణ
    ‘వి’లో సుధీర్ బాబు పాత్ర హీరోకు సమానమైనదిగా నడుస్తోంది. సినిమా ఎంట్రీలోనే సుధీర్ బాబు మంచి ఫైట్ సీన్ తో కన్పిస్తున్నాడు. సిక్స్ ప్యాక్ బాడీతో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. టైటిల్ కార్డులోనే సుధీర్ బాబును సూపర్ కాప్ గా దర్శకుడు చూపించారు. అయితే ఆ వెంటనే ఈ కాప్ ను హీరోయిన్ ఫ్లర్టింగ్ చేస్తుంటుంది. నాని మర్డర్లు చేస్తూ పోలీస్ కాపుకు ఛాలెంజ్ విసిరడం సినిమాలో రోటిన్ మారిపోతుంది. అయితే సుధీర్ బాబు కొన్ని సీన్లలో కామెడీ చేయడం.. నాని వదిలిని క్లూ చాలా కామెడీగా ఉన్నాయి. దీంతో ‘వి’లో సస్పెన్స్ థిల్ మిస్సయినట్లు కన్పిస్తుంది.ఇక హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. నివేధా దామన్ కేవలం పాటలకు, కొన్ని సీన్లకే పరిమితమైంది. అదితి రావు నిడివి చాలా తక్కువగా ఉంది. ఇక తమన్‍ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకున్నాడు. సినిమాలో నాని పాత్ర ఆ మాత్రమయినా ఎలివేట్‍ అయిందంటే తమన్ మ్యూజికే కారణం. సినిమాటోగ్రఫీ బాగుంది. వెన్నల కిషోర్ కామెడీతో ఆకట్టుకున్నాడు. రచయిత, దర్శకుడు అయిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ ‘వి’ సినిమాపై ఇంకొంచెం ఫోకస్ పెడితే బాగుండేది అనిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా రోటిన్ సినిమానే తలపిస్తోంది. ఈ థియేటర్ల కంటే ఓటీటీలో విడుదల కావడం నిర్మాతకు మంచే చేసింది.

    – oktelugu రేటింగ్: 2.5/5