
2021లో కోహ్లీ ఫాం కోల్పోయి ఒక్క సెంచరీ చేయడం లేదు. గట్టిగా పరుగుల చేయడం లేదు. ఒక బిడ్డకు తండ్రి అయ్యాక కోహ్లీలో పరుగుల దాహం తగ్గిపోయిందా అన్నట్టుగా వరుసగా డకౌట్లు అయిపోతున్నాడు. ఎన్నడూ సున్నాకు ఔట్ కానీ కోహ్లీ గత ఆస్ట్రేలియా సిరిస్ నుంచి వరసుగా రెండు మూడు సార్లు డకౌట్ అయ్యాడు.
తాజాగా ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లోనూ టీమిండియా కెప్టెన్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. అయితే కోహ్లీ డకౌట్ ను ఉత్తరాఖండ్ పోలీసులు వినూత్నంగా వాడుకున్నారు. వాహనదారులకు కోహ్లీని ఉదాహరణగా చూపారు.
ఇంగ్లండ్ తో మ్యాచ్ లో డకౌట్ అయిన కోహ్లీ ఫొటోని ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొని ‘రహదార్లపై ర్యాష్ డ్రైవింగ్ చేసే వారికి వినూత్న సందేశం పంపారు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత అవశ్యకం. లేకపోతే కోహ్లీ లాగే మీరు కూడా డకౌట్ అయిపోతారు అని హిందీలో రాసిన పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 124/7కే పరిమితమైంది. కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ కేవలం 15.3 ఓవర్లలోనే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీ నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు డకౌట్ కావడం విశేషం. అందుకే పోలీసులు కోహ్లీ ఏకాగ్రత లోపించిందనేలా ఈ పోస్టు చేసినట్టు తెలుస్తోంది.