అమెరికా అధ్యక్ష డిబేట్: ‘మురికి’ అంటూ భారత్ పై ట్రంప్ అక్కసు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన మూడో చివరి డిబేట్ గురువారం రాత్రి జరిగింది. ఈ భేటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ పాల్గొన్నారు. ఈ చివరి డిబేట్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. Also Read: ఇక ఆంక్షల్లేవ్.. ఏ దేశమైనా ఎగిరిపోవచ్చు! చర్చలో భాగంగా ట్రంప్ మరోసారి చైనా, భారత్, రష్యాలను టార్గెట్ చేశాడు. ‘చైనాను చూడండని.. ఎంత మురికిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. […]

Written By: NARESH, Updated On : October 23, 2020 11:11 am
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన మూడో చివరి డిబేట్ గురువారం రాత్రి జరిగింది. ఈ భేటిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ పాల్గొన్నారు. ఈ చివరి డిబేట్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు.

Also Read: ఇక ఆంక్షల్లేవ్.. ఏ దేశమైనా ఎగిరిపోవచ్చు!

చర్చలో భాగంగా ట్రంప్ మరోసారి చైనా, భారత్, రష్యాలను టార్గెట్ చేశాడు. ‘చైనాను చూడండని.. ఎంత మురికిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. రష్యా వైపు, భారత్ వైపు చూడండి.. కాలుష్యం బారినపడి గాలి మురికిగా ఉంది. మేము ట్రిలియన్ డాలర్లను తీసుకోవాలసి రావడంతో పారిస్ కాలుష్య ఒప్పందం నుంచి వైదొలుగామని.. మా పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించారని’ ట్రంప్ విమర్శలు గుప్పించారు.

పారిస్ కాలుష్య నియంత్రణ ఒప్పందంలో అమెరికా కనుక భాగస్వామ్యం అయితే లక్షలాది ఉద్యోగాలను, వేలాది కంపెనీలను కోల్పోయేవాళ్లమని.. కానీ నేతు ఆ త్యాగం చేయలేదని ట్రంప్ వెనకేసుకొచ్చారు. పాశ్చాత్యా దేశాలు చేస్తుండగా లేనిది అమెరికాకే ఎందుకు ఈ అన్యాయం అంటూ చర్చలో ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

ఇక మొదటి అధ్యక్ష చర్చలో కూడా డొనాల్డ్ ట్రంప్.. భారతదేశంపై విమర్శలు గుప్పించారు. కరోనా మరణాలు, కేసుల విషయంలో భారత్ లాంటి దేశాలు సరైన సమాచారాన్ని చూపడం లేదంటూ ఆడిపోసుకున్నారు. ఇప్పుడు మరోసారి కాలుష్యంలో భారత్ మురికి అంటూ నోరుపారేసుకున్నారు.

Also Read: చంద్రబాబు సైడ్‌.. చినబాబుకే స్టీరింగ్..

నిజానికి 2018 డిసెంబర్ లో వెల్లడించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ ప్రొజెక్షన్ ప్రకారం.. ప్రపంచ కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే దేశాలలో చైనా 27శాతంతో ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది. 15శాతంతో అమెరికా రెండోస్థానంలో ఉంది. 10శాతంతో యూరప్ మూడో స్థానంలో ఉండగా.. 7శాతంతో భారత్ నాలుగోస్థానంలో ఉంది. అయినా ట్రంప్ భారత్ ను కాలుష్య కారక దేశంగా పేర్కొనడంపై భారతీయులు మండిపడుతున్నారు.