https://oktelugu.com/

నిరుద్యోగ తెలంగాణ

సండే స్పెషల్: తెలంగాణ.. పోరాటాలకు పురిటి గడ్డ. తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ. ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ. భూమి కోసం.. భుక్తి కోసమంటూ జరిగిన మొదటి దశ పోరాటం.. తర్వాత తర్వాత నీళ్లు.. నిధులు.. నియామకాలు అంటూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే బాధలు పోతాయని పిల్లాజెల్లా.. ముసలి ముతక.. అందరూ రోడ్ల పైకి వచ్చారు. రాష్ట్రం వచ్చే దాకా కొట్లాడారు. మరికొందరు ఏకంగా ప్రాణాలే అర్పించారు. ఎంతో మంది త్యాగజనుల ఫలితమే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2020 / 09:13 AM IST

    Unemployment in Telangana

    Follow us on

    సండే స్పెషల్: తెలంగాణ.. పోరాటాలకు పురిటి గడ్డ. తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ. ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ. భూమి కోసం.. భుక్తి కోసమంటూ జరిగిన మొదటి దశ పోరాటం.. తర్వాత తర్వాత నీళ్లు.. నిధులు.. నియామకాలు అంటూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే బాధలు పోతాయని పిల్లాజెల్లా.. ముసలి ముతక.. అందరూ రోడ్ల పైకి వచ్చారు. రాష్ట్రం వచ్చే దాకా కొట్లాడారు. మరికొందరు ఏకంగా ప్రాణాలే అర్పించారు. ఎంతో మంది త్యాగజనుల ఫలితమే ఈ మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం.2018 జూన్‌ 6న కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. ఇక మన నిధులు.. మన నీళ్లు.. మన నియామకాలు మనకే వస్తాయని అందరూ సంబురపడ్డారు. అనుకున్నట్లుగానే ఉద్యమం ఉర్రూతలూగించిన కేసీఆర్‌‌ సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏయే లాభాలు ఉంటాయో ఉద్యమ సమయంలో ఎన్నో చెప్పారు ప్రజలకు. ఒక టర్మ్‌ ముగిసింది.. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మరోసారి కేసీఆరే సీఎం అయ్యారు.కానీ.. ఏం లాభం ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు లక్షల కోట్ల అప్పులో మునిగిపోయింది.

    ఇక నీళ్ల ముచ్చట ఆలోచిస్తే.. ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం నిర్మించినా దాని నుంచి ఒక్క ఎకరా పారింది లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులే ఇప్పుడు ఆదుకుంటున్నాయి. ఇక నియామకాల విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా నియామకాలు చేపట్టాల్సిన సర్కార్‌‌ ఎంత మందికి ఇచ్చిందో అందరికీ తెలుసు. మన రాష్ట్రం మనకు వస్తే ఇంటికో ఉద్యోగం అంటూ ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్‌‌.. ఇప్పుడు చేస్తున్నదేంటి. నెలనెలా సర్కార్‌‌ ఉద్యోగులు రిటైర్మెంట్‌ అవుతున్నా ఏ శాఖలోనూ కొత్త రిక్రూట్‌మెంట్‌ లేదు. దీనికి తోడు కాంట్రాక్ట్‌ వ్యవస్థను ఒకటి తర్వాత ఒకటి రద్దు చేస్తూనే ఉన్నారు. అంటే.. ఉన్న కొలువులు కూడా ఊడుతున్నాయన్నమాట. మరి ప్రత్యేక రాష్ట్రంలో మనం కోరుకున్నది ఇదేనా అని ఇప్పుడు ప్రజల్లో హాట్‌ టాపిక్‌ అయింది.

    ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా డిపార్ట్‌మెంట్లు.. వాటిలో పనిచేస్తున్న ఎంప్లాయిస్‌ సంఖ్య పరిశీలిస్తే ఇలా ఉంది..రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో లక్షా 51 వేల 116 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఏకంగా సర్కారే గుర్తించింది. వాటిలో 58,240 పోస్టులను ఆరేండ్లలో భర్తీ చేయగా.. 92,876 ఖాళీగా ఉన్నాయి. ప్రతినెలా అన్ని డిపార్ట్మెంట్లలో కలిపి ఆరేడు వందల మంది రిటైర్ అవుతున్నారు. ఇవి కలిపితే ఖాళీల సంఖ్య లక్షకు పైనే ఉంటుంది.రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ దాదాపుగా నిలిచిపోయిందనే చెప్పాలి. అత్యవసరమైన వాటిని మాత్రం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో టెంపరరీగానే భర్తీ చేస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్లలో లక్షకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా రిక్రూట్మెంట్ఊసేలేదు. ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా ప్రభుత్వం వాయిదా వేస్తోంది. కొత్తగా చేసే నియామకాలు అన్నింటికీ కాంట్రాక్టు పద్ధతిని లింక్ పెడుతోంది. తాజాగా పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌లో 2,092 పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో రిక్రూట్ చేయాలని నిర్ణయించింది. ఇదే డిపార్ట్మెంట్‌లో నిరుడు భర్తీ చేసిన 190 పోస్టుల కాంట్రాక్టును ఇంకో ఏడాది పొడిగించింది. ఈ లెక్కన ఇక రెగ్యులర్ రిక్రూట్మెంట్జాడ లేనట్టేనని మరోసారి స్పష్టమైంది. సర్కారీ జాబ్లకు ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుందా అని ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులు.. ఇప్పుడు టెంపరరీ పోస్టుల కోసం పోటీపడే పరిస్థితి నెలకొంది. గతేడాది జరిగిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల రిక్రూట్మెంట్ మూడేళ్ల కాంట్రాక్టు పద్ధతినే చేపట్టింది.

    Also Read: మావోయిస్టులు ఎందుకు కనుమరుగయ్యారు?

    తెలంగాణ ఏర్పడిన తర్వాత 661 గురుకులాలు ప్రారంభించారు. వాటిలో టీచింగ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌  రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేసినా కొన్ని మాత్రమే రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మిగతా ఖాళీ టీచింగ్‌‌‌‌‌‌‌‌ పోస్టుల్లో సబ్జెక్ట్‌‌‌‌‌‌‌‌  అసోసియేట్స్‌‌‌‌‌‌‌‌ను ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. నాన్‌‌‌‌‌‌‌‌ టీచింగ్‌‌‌‌‌‌‌‌ పోస్టులైతే మొత్తంగా ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. ఇలా మూడు వేల మందికిపైనే ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ లో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. సంక్షేమ శాఖల్లో అవసరమైన పోస్టులను కూడా ఇలాగే రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు.

    రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 2.10 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 1.45 లక్షల మంది ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌, 65 వేల మందిని కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేశారు. ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ, మున్సిపల్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్మెంట్లలోనే ఈ టెంపరరీ ఎంప్లాయీస్ ఎక్కువ. చాలా మందికి జీతాలు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ కమిషన్‌‌‌‌‌‌‌‌, ఇతర కటింగ్ల రూపంలో మరింతగా కోతలు పెడుతున్నారు. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారికి ఎలాంటి బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ వర్తించని పరిస్థితి ఉంది.

    Also Read: రేవంత్ కొత్త రాజకీయ పార్టీ…. కాంగ్రెస్ కు షాక్ తప్పదా….?

    అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌మెంట్‌లో 200 మంది ఏఈవోలను ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ పద్ధతిన రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో కంప్యూటర్‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది 1,500 మందికిపైనే ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. 2,500 మందికిపైగా లష్కర్‌‌‌‌‌‌‌‌లను నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నియామకాలు కూడా ఔట్సోర్సింగ్విధానంలోనే ఉండనున్నట్టు తెలిసింది. మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథలో ఇంజినీర్లు, పాత ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ మినహా అందరూ ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులే. జిల్లా, మండల పరిషత్ ఆఫీసుల్లో ఫోర్త్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌‌‌‌‌, పరిషత్ స్కూళ్లలో స్వీపర్లు తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు. వీళ్లు 15 వేల మంది వరకు ఉంటారని చెప్తున్నారు. కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌ కోసం ఏర్పాటు చేసిన టిమ్స్‌‌‌‌‌‌‌‌ సహా అన్ని గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటళ్లలో డాక్టర్లు, ఇతర మెడికల్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. దాదాపు 3,500 మందిని కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేయడానికి నోటిఫికేషన్లు ఇచ్చారు. కాంట్రాక్టు విధానంలో పనిచేయడానికి డాక్టర్లు, నర్సులు ముందుకు రాలేదు. దీంతో రెండు, మూడు సార్లు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి వచ్చింది. మొత్తంగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వెయ్యి మంది వరకు డాక్టర్లను రిక్రూట్‌‌‌‌‌‌‌‌ చేశారు. మిగతా 6 వేల మంది వరకు హెల్త్‌‌‌‌‌‌‌‌  సిబ్బంది ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ విధానంలో నియామకమైన వారే.

    -శ్రీని