
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యువత ప్రధానంగా అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాడు. కేసీఆర్ పూర్తిగా వదిలేసిన ఉద్యోగాలు, నిరుద్యోగులు, నిరుద్యోగ భృతిని ప్రతీ సందర్భంలోనూ లేవనెత్తుతున్నారు. కేసీఆర్ సర్కార్ ను ఇరకాటంలో పడేస్తున్నారు. ఇటీవల ఉద్యోగుల ఫిట్ మెంట్ గురించి లేవనెత్తుతూ ఆయా వర్గాలను బీజేపీకి చేరువ చేస్తున్నాడు బండి సంజయ్.
ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. నిరుద్యోగుల కోసం 50వేల ఉద్యోగ ప్రకటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు.. ఎన్నికల్లో హామీనిచ్చిన నిరుద్యోగ భృతిని అమలు చేయడానికి సిద్ధమైనట్టు తెలిసింది.
తాజాగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ ఓ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగ భృతి వస్తోందని తెలిపారు.సీఎం కేసీఆర్ రేపోమాపో దీన్ని ప్రకటిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగ భృతి వస్తోందని.. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని కేటీఆర్ అన్నారు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ప్రతిపక్ష నేతలు ఇవన్నీ గమనించాలని హితవు పలికారు. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లే టీపీసీసీ, టీ బీజేపీ అధ్యక్ష పదవులు వచ్చాయని.. మీ పదవులు మా ఘనతే అని బండిసంజయ్ ను పరోక్షంగా కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు.
దీన్ని బీజేపీ వేడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాగానే తగులుతోందని అర్థమవుతోంది. ముఖ్యంగా యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు టార్గెట్ బీజేపీ ఒత్తిడి వల్లే కేసీఆర్ ఇప్పుడు నిరుద్యోగ భృతిని అమలు చేస్తున్నారని తెలుస్తోంది.