తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగ భృతి ఎంతంటే..?

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగ భృతి అందజేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వగా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఆ హామీ అమలు కాలేదు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల యువత నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటి సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన వల్ల […]

Written By: Navya, Updated On : January 28, 2021 6:09 pm
Follow us on

తెలంగాణ మంత్రి కేటీఆర్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు త్వరలోనే నిరుద్యోగ భృతి అందజేస్తామని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వగా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ఆ హామీ అమలు కాలేదు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల యువత నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇలాంటి సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన వల్ల నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం మీటింగ్ లో పాల్గొన్న కేటీఆర్ 1,31,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని.. త్వరలో 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామని అన్నారు. తెలంగాణ సర్కార్ రూ. 3,016 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన ప్రకటనపై నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

కేటీఆర్ తెలంగాణ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతూ కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి కోతలు ఉండవని గర్వంగా ఉండగలవని గర్వంగా చెప్పగలమని తెలిపారు. విద్యుత్ కార్మికుల కఠోర శ్రమ వల్ల కరెంట్ కోతలు లేకుండా చేయగలుగుతామని అన్నారు. ప్రభుత్వం తాగునీటి సమస్యలకు పరిష్కరించిందని.. తెలంగాణ దేశంలోనే ధాన్యాగారంగా మారిందని తెలిపారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని.. 16 వేల మెగావాట్ల కు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని కేటీఆర్ తెలిపారు. అద్భుతమైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ లను పెంచుకున్నామని అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణలోనే నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని కేటీఆర్ అన్నారు.