‘మాస్ మహారాజా’ రవితేజ సినిమాలు ప్రస్తుతం అటు మాస్ లో ఆడట్లేదు, ఇటు క్లాస్ లో ఆడట్లేదు. గత ఏడు సినిమాలుగా సక్సెస్ కోసం యుద్ధం చేస్తున్నా.. మాస్ రాజాకి హిట్ రావడం కష్టమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఈ రోజు భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది క్రాక్ సినిమా. అయితే ‘క్రాక్’ సినిమా మార్నింగ్ 8:45 షో క్యాన్సల్ అయింది. నిర్మాత ఠాగూర్ మధుకి ఉన్న కొన్ని ఆర్ధిక ఇబ్బందులు కారణంగా.. తమకు డబ్బులు చెలిస్తేనే సినిమా రిలీజ్ చేయాలి అంటూ.. ఓ బయ్యరు పట్టుబట్టి మరీ మార్నింగ్ షోని రద్దు చేయించాడు.
Also Read: హరితేజ సీమంతం చూడడానికి మీ రెండు కళ్లు చాలవు
మధు ఎలాగూ తన పర్సనల్ పనిలో చెన్నైలో ఉండటం వల్ల.. మార్నింగ్ షో 8:45 షో క్యాన్సల్ విషయంలో ఆయన ఏమి చేయలేకపోయారు. అయితే పది గంటల షో పడే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఇక నిజ జీవిత సంఘటనల ఆధారంగా రానున్న క్రాక్ సినిమా రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తుంది.
Also Read: బాలయ్య అయితే ఏంటి.. నేను హీరోయిన్ !
కాగా ఈ ఏడాది ఆరంభంలో కూడా ‘డిస్కో రాజ’ అంటూ పలకరించిన రవితేజ బాగా నిరాశ పరిచాడు. దాంతో రవితేజ క్రాక్ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రవితేజ బోలెడు ఆశలుపెట్టుకున్న ‘డిస్కో రాజా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఎలాగైనా క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్