https://oktelugu.com/

పాపం ట్రంప్.. నరకయాతన పడుతున్నాడట..!

డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు చెబితేనే ఓ వైబ్రేషన్. అమెరికన్లకు ఓ సెన్షేషన్.. ప్రత్యర్థి దేశాలకు హడల్. అలాంటి ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడగానే గాలి తీసిన బుడగలా మారిపోయారు. మొదట్లో కాస్త హడావుడి చేసిన ట్రంప్ వైరాగ్యపు మాటలు మాట్లాడడం వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రంప్ ను అయ్యో పాపం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Also Read: తలైవా న్యూ ఇయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : December 3, 2020 / 07:35 PM IST
    Follow us on

    డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు చెబితేనే ఓ వైబ్రేషన్. అమెరికన్లకు ఓ సెన్షేషన్.. ప్రత్యర్థి దేశాలకు హడల్. అలాంటి ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడగానే గాలి తీసిన బుడగలా మారిపోయారు. మొదట్లో కాస్త హడావుడి చేసిన ట్రంప్ వైరాగ్యపు మాటలు మాట్లాడడం వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రంప్ ను అయ్యో పాపం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: తలైవా న్యూ ఇయర్ గిప్ట్.. ఎన్నికల్లో పోటీకి సై అంటున్న రజనీ..!

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఖాయం అనుకున్న ట్రంప్ ఓడిపోవడంతో తాజాగా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన అతిథులతో ట్రంప్ తన గోడు వెళ్లబోసుకున్నాడట..

    గడిచిన నాలుగేళ్లుగా అమెరికా ఫస్ట్ నినాదంతో వివిధ దేశాలకు, విదేశీయులకు కంట్లో నలుసుగా మారానని.. అప్రతిహత పాలన సాగించానని ట్రంప్ చెప్పుకొచ్చాడట. ఇంత చేసినా తనను అమెరికన్లు ఓడించారని సన్నిహితుల వద్ద ట్రంప్ వాపోయారట.. కోర్టులు, ఎన్నికల్లో అక్రమాలు జరిగినా తన వాదన వినడం లేదని ఆవేదన చెందాడట..

    Also Read: ఫేక్ కాదు.. షేక్.. సీఎం జగన్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..!

    ప్రస్తుతం ఎన్నికల అక్రమాలపై ట్రంప్ పోరాడుతున్నారు. ఆధారాలు చూపినా కోర్టులు కొట్టివేస్తున్నాయి. దీంతో బైడెన్ గెలుపును అంగీకరించలేక.. ఇటు తిరస్కరించలేక పాపం ట్రంప్ నరకయాతన పడుతున్నాడట..

    మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు