‘రాంగ్ గోపాల్ వర్మ’ మూవీ ఎలా ఉందంటే..?

రామ్ గోపాల్ వర్మపై రూపొందించిన చిత్రాలు ఒక్కోటి రిలీజ్ అవుతున్నాయి. అలా వచ్చిందే ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రం. సీనియర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం ఎలా ఉందో.. దర్శకుడిగా ప్రభు ఎలా మెప్పించారు అంటే.. ముందుగా కథ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రాజ్ గోపాల్ వర్మ (షకలక శంకర్) అంతా నా ఇష్టం అనే విధంగా ఒక రకమైన అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటాడనే విషయాన్ని చెబుతూ ఈ సినిమా […]

Written By: admin, Updated On : December 3, 2020 7:31 pm
Follow us on


రామ్ గోపాల్ వర్మపై రూపొందించిన చిత్రాలు ఒక్కోటి రిలీజ్ అవుతున్నాయి. అలా వచ్చిందే ‘రాంగ్ గోపాల్ వర్మ’ చిత్రం. సీనియర్ జర్నలిస్టు ప్రభు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు చేపట్టిన ఈ చిత్రం ఎలా ఉందో.. దర్శకుడిగా ప్రభు ఎలా మెప్పించారు అంటే.. ముందుగా కథ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు రాజ్ గోపాల్ వర్మ (షకలక శంకర్) అంతా నా ఇష్టం అనే విధంగా ఒక రకమైన అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటాడనే విషయాన్ని చెబుతూ ఈ సినిమా మొదలైంది. ఇక ఆయన స్పూర్తితో డైరెక్టర్ కావాలనే కోరికతో ఓ ఔత్సాహికుడు (కత్తి మహేష్) శిష్యరికం చేస్తుంటాడు.

Also Read: పవన్, మహేష్ కలిస్తే.. బాక్సాఫీస్ బద్దలే !

కానీ ఓ కారణం వల్ల అతన్ని తన వద్ద ఉండటానికి వీలులేదని బయటకు పంపిస్తాడు. దాంతో ఆ శిష్యుడు వెళ్తూ.. శాపనార్థాలు పెడతారు. ఇంతకీ ఆ శిష్యుడు ఏ రకమైన శాపాలు పెడుతాడు? రాంగోపాల్ వర్మ జీవితంలోకి ప్రవేశించిదెవరు? ఇంతకు రాజ్ గోపాల్ వర్మకు తాను చేసే పనుల గురించి రియలైజ్ అయ్యారా? లేదా ? మిగిలిన కథ. కాగా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు జర్నలిస్టు ప్రభు రాసిన మాటలు బాగున్నాయి . ఛాయాగ్రాహకుడు బాబు కెమెరా వర్క్ బాగుంది. సంగీత దర్శకుడు షకీల్ రూపొందించి టైటిల్ సాంగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. రాంగోపాల్ వర్మపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ వచ్చిన చిత్రాల్లో ఈ రాంగ్ గోపాల్ వర్మ బెటర్ గా ఉంది.

Also Read:  “సలార్” దెబ్బకు ప్రభాస్ సినిమాల రాక మారింది !

అలాగే రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన విషయాలను పక్కగా పరిశోధన చేసి.. అసభ్యత, అశ్లీలత, వ్యక్తిగత దూషణకు తావు లేకుండా సినిమాను రూపొందించడంలో జర్నలిస్టు ప్రభు పరిణితిని ప్రదర్శించారు. తనకున్న లిమిటెడ్ బడ్జెట్‌లో తెరమీద క్వాలిటీ చూపించడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే సినిమాలో మ్యాటర్ లేదు. టైం వేస్ట్ తప్పితే ఈ సినిమా వల్ల ఫీల్ అయ్యే అనుభూతి ఏమి లేదు. నటీనటులు ప్రదర్శన విషయానికి వస్తే… షకలక శంకర్, అభి, దర్శకుడు, నిర్మాత జర్నలిస్టు ప్రభు ప్రధానమైన పాత్రల్లో నటించి బాగానే నటించారు. కానీ మంచి మంచి చిత్రాలు వస్తోన్న ఈ తరుణంలో ఇలాంటి సినిమాని చూడాల్సిన అవసరం లేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్