
కరోనా కల్లోలం దేశంలో తగ్గి థియేటర్లు ఓపెన్ అయ్యి సినిమాలు విడుదలైన వేళ టాలీవుడ్ ను మరో ఉపద్రవం భయపెడుతోంది. బ్రిటన్ లో పుట్టిన కొత్త కరోనా స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచానికి పాకి కరోనా సెకండ్ వేవ్ కు కారణమవుతోంది.
Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?
బ్రిటన్ లో పుట్టిన కొత్త కరోనా స్ట్రెయిన్ అమెరికాను కలవరపెడుతోంది. రోజురోజుకు అక్కడ కేసులు పెరిగిపోతున్నాయి. అమెరికాలోని రెస్టారెంట్లు, పర్యాటక ప్రదేశాలన్నీ కరోనా విస్తృతితో మూతపడుతున్నాయి.
అయితే అమెరికాలో కరోనా వైరస్ విస్తృతి టాలీవుడ్ సినీ పరిశ్రమకు శరాఘాతంగా మారింది. జనవరి నుంచి జూన్ వరకు అమెరికా, యూరప్ లో షూటింగ్ లకు ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాలకు ఈ పరిస్థితి పెద్ద విఘాతంగా మారింది.
Also Read: భార్యలో నచ్చిన క్వాలిటీ అదే.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..?
ఇక పెద్ద సినిమాల హీరోల సినిమాలు అమెరికా సహా ఓవర్సీస్ లో బాగా ఆడుతాయి. 10 -15 కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయినా విదేశాల్లో ఆడకపోతే నిర్మాతలు హీరోలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అటు షూటింగ్ లకు జాప్యం.. ఇటు సినిమాలు విడుదల కాక ఇప్పుడు కరోనా కారణంగా టీవీ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదంలో పడింది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్