
మన దేశంలోని రైళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సరైన సమయానికి రైళ్లు రావని ప్రయాణికులలో చాలామంది అభిప్రాయపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో రైలు రావాల్సిన సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా రావడం గురించి మనకు తెలిసిందే. రైలు ప్రయాణాల గురించి రైలు ప్రయాణికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. రైలు మధ్యలో స్టేషన్లలో ఆగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఎలాంటి స్టేషన్లు లేకపోయినా ఆగిపోతుంది.
Also Read: మహేష్ బాబు కార్ వాన్ ధర ఎంతో తెలుసా?
అయితే డీజిల్ ఇంజిన్ తో నడిచే రైలు ఒక నిమిషం ఆగితే రైల్వేశాఖకు ఏకంగా 20,401 రూపాయలు నష్టం వస్తుందని సమాచారం. ఆ ట్రైన్లు కాకుండా కరెంట్ తో నడిచే ట్రైన్లు అయితే మాత్రం ఏకంగా 20,459 రూపాయల నష్టం వస్తుంది. కదిలే రైలు ఏ కారణం లేకుండా ఆగితే ఇంత మొత్తం రైల్వే శాఖకు నష్టం వస్తుంది. సాధారణ ట్రైన్ లతో పోలిస్తే గూడ్స్ ట్రైన్ల విషయంలో ఈ మొత్తం భిన్నంగా ఉంటుంది.
Also Read: ఎస్బీఐ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే..?
డీజిల్ గూడ్స్ ట్రైన్ అయితే 13,334 రూపాయలు, ఎలక్ట్రిక్ గూడ్ ట్రైన్ అయితే ఏకంగా 13,392 రూపాయలు నష్టం వస్తుంది. ఒకసారి ఏ కారణం చేతనైనా రైలు ఆగితే ఆ రైలు వేగం పుంజుకోవడానికి ఏకంగా మూడు నిమిషాల సమయం పడుతుందని సమాచారం. రైలు స్పీడ్ పుంజుకోవాలంటే సాధారణంగా అవసరమైన మొత్తంతో పోలిస్తే డీజిల్ లేదా ఎలక్ట్రిసిటీ ఎక్కువ మొత్తం అవసరమవుతుంది.
మరిన్ని వార్తల కోసం: అత్యంత ప్రజాదరణ (ట్రెండింగ్)
ఒక రైలు ఏదైనా కారణం వల్ల ఆగిపోతే ఆ ప్రభావం మిగతా రైళ్లపై పడుతుంది. ఈ కారణాల వల్లే కొన్నిసార్లు రైళ్లు ఒక ఫ్లాట్ ఫామ్ కు బదులుగా మరో ఫ్లాట్ ఫామ్ పైకి రావడం, రైళ్లు క్యాన్సిల్ కావడం, ప్యాసింజర్లకు రైల్వే శాఖ డబ్బులు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.