
ఇటీవల కాలంలో వెబ్ సిరీసుల హవా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ వెబ్ సీరిసులకు ప్రాధాన్యం ఇస్తూ టెలిక్యాస్ట్ చేస్తున్నాయి. సినిమాలకు మించిన కంటెంటులతో వెబ్ సిరీసులు ఉంటుండటంతో సినీప్రియులంతా ఓటీటీల వైపు ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే ఓటీట్లో వచ్చిన పలు వెబ్ సిరీసులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ‘ఎక్స్పైరీ డేట్’ అనే వెబ్ సీరిస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ ను జీ5 తాజాగా విడుదల చేసింది. ఎక్స్ పైరీ డేట్ వెబ్ సిరీసుతో స్నేహ ఉల్లాల్ వెబ్ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఇందులో మధుశాలిని.. టోనీ లూక్.. అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో మొత్తం పది ఎపిసోడ్స్ తో ‘ఎక్స్ పైరీ డేట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ విషయానికొస్తే.. డిసెంబర్ 17న గుంటూరులో అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ టోనీ లూక్ వెళుతాడు. అదే అగర్వాల్ పెళ్లికి వెళ్లిన తన భర్త కన్పించడం లేదని మరో ఓ మహిళ అంతకముందే పోలీసులకు ఫిర్యాదు చేస్తోంది. దీంతో ఆ రెండు కేసులకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో సాగిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
ఊహించిన మలుపులతో ఎక్స్ పైరీ డేట్ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. శంకర్ కె.మార్తాండ్ ఈ వెబ్ సిరీసుకు దర్శకత్వం వహిహిస్తుండగా.. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ వెబ్ సిరీసును నిర్మించాడు. ‘ఎక్స్పైరీ డేట్’ తెలుగు వర్షన్ అక్టోబర్ 9న విడుదల కానున్నట్లు జీ5 ప్రకటించింది.
https://www.youtube.com/watch?v=ZyyCwRZPAZQ#action=share