
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చాడు. ఎవరూ ఊహించిన విధంగా మహేష్ డ్యూయల్ రోల్లో కన్పించి అందరికీ షాకిచ్చారు. మహేష్ బాబు అన్న.. తమ్ముడిగా ద్విపాత్రభినయం చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. మహేష్ బాబు డ్యూయల్ రోల్ వెనుక ఉన్న కథాకమమీషూ ఏంటో ఒకసారి చుద్దాం..!
Also Read: ఆర్ఆర్ఆర్ విడుదలపై స్పందించిన రాజమౌళి
2020లో మహేష్ బాబు అందరికీ కంటే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మహేష్ నటించిన ‘సరిలేరునికెవ్వరు’ సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. అనంతరం కొత్త సినిమా ప్రారంభించాలని భావించగా కరోనా ఎఫెక్ట్ షూటింగులు వాయిదా పడ్డాయి.
తాజాగా మహేష్ బాబు పర్శురాం దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్ ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. మహేష్ బాబు సోషల్ మీడియాలో అందరి కంటే యాక్టివ్ గా ఉంటాడు. లాక్డౌన్ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన పిక్స్, వీడియోలను పోస్టు చేశారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో వీడియోలను పోస్తూ అభిమానులు అప్రమత్తం చేశాడు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు ద్విపాత్రభినయంలో కన్పించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. మహేష్ బాబు ఇప్పటివరకు సినిమాల్లో డబుల్ రోల్ చేశారు. బాలనటుడిగా ఉన్నప్పుడు కొడుకుదిద్దిన కాపురంలో రెండుపాత్రల్లో నటించిన మహేష్ హీరోగా మారిన తర్వాత అలాంటివి చేయలేదు. అయితే తాజాగా ప్రముఖ ఆన్ లైన్ విక్రయ సంస్థ ఫ్లిప్ కార్ట్ కోసం మహేష్ ఒక యాడ్ చేశారు. ఇందులో మహేష్ అన్నగా.. తమ్ముడిగా కన్పించడం విశేషం.
Also Read: శ్రీముఖి కేకల పై నాగబాబు కామెంట్స్ !
*పట్నంలో ఉన్న తమ్ముడి దగ్గరకు అన్నయ్య వస్తాడు.. వచ్చిరాగానే డస్ట్ పట్టిన తమ్ముడి ఆఫీస్ టేబుల్ ని చూపించాడు.. ఆ తర్వాత అక్కడే బాగా మాసిపోయిన గుడ్డల్ని వాషింగ్ మెషిన్లో ఉతుక్కోమని సలహా కూడా పడేశాడు. షాపింగ్ దద్దరిల్లిపోవాలంటూ పంచె కట్టు.. కోరమీసంతో కన్పించిన అన్నయ్య సాఫ్ట్ వేర్ తమ్ముడికి చెప్పడం’ ఆకట్టుకుంది. పంచె కట్టులో.. మాడ్రన్ డ్రెసులో మహేష్ కు సాటిలేరు అన్నట్లుగా ఈ ప్రకటన ఉండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
