Homeఅత్యంత ప్రజాదరణవిశాఖ గ్యాస్ మిగిల్చిన విషాద గీతమిదీ!

విశాఖ గ్యాస్ మిగిల్చిన విషాద గీతమిదీ!

 Visakhapatnam LG polymers gas

విశాఖపట్నంలో విషవాయువు దుష్పరిణామాలు ఇంకా వెంటాడుతున్నాయి. విశాఖలోని ‘ఎల్జీపాలిమర్స్‌’ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన సంఘటన జరిగి ఆరు నెలలవుతున్నా ఇంకా ఆ భయం బాధితులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ సంఘటన నుంచి ఇంకా విశాఖ ప్రజలు కోలుకోవడం లేదు. విశాఖలోని ఎల్.జీ పాలిమర్స్ పరిశ్రమ వెదజల్లిన స్టైరిన్ గ్యాస్ ధాటికి ఎంతో మంది చనిపోయారు. అక్కడ ప్రకృతి కూడా నాశనమైంది.. తాగే నీరు, ఆహారం, భూమి, ఆకాశం, వాయువు, జలం కలుషితమైనట్టు అప్పట్లో నిపుణులు తేల్చారు. కొన్ని సంవత్సరాలు ఈ పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

విశాఖ గ్యాస్ ప్రభావం తగ్గిపోయే పరిస్థితులు కనిపించడం లేదు.పండించే పంట నుంచి భూగర్భంలోని నీరు వరకు కలుషితమైనట్టు నిపుణులు తేల్చారు. గాలి సైతం కలుషితమైంది. అవన్నీ సామాన్య స్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్క్డడ జీవకోటి మనుగడకు ముప్పు ఉందంటున్నారు.ఆ ప్రాంతంలో పండిన పంటలు తినేందుకు అనుకూలం కాదని.. బావుల్లో నీరు తాగడానికి, వాడడానికి పనికి రావని తేల్చారు. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకుపోవడం.. నీరు ఎండిపోవడం గానీ జరిగితే విషవాయువు ప్రభావం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.స్టైరీన్ గ్యాస్ పాలిమర్ గా మారుతోందని.. అది శరీరంలో చేరితే విషవాయువును ఉత్పత్తి చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: టీడీపీకి షాకిచ్చిన మాజీ ఎంపీ.. వైసీపీలోకి.. కారణం అదేనా?

ఈ ఏడాది మే 7వ తేదీన విశాఖ పట్నంలోని ‘ఎల్జీపాలిమర్స్‌’ నుంచి గ్యాస్‌ లీకై దాదాపు 10 మంది వరకు చనిపోయారు. ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్‌ ప్రమాదం జరిగే అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా ‘ఎల్జీపాలిమర్స్‌’ నుంచి స్టైరీన్‌ గ్యాస్‌ లీకైంది. అయితే కరోనాకు వేసే మందు అనుకొని అందరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ గుర్తించిన కొందరు తేరుకునేలోపే పెద్ద ప్రమాదం సంభవించింది. గ్యాస్‌ పీల్చుకున్న వారు ఎక్కడికక్కడే పడిపోయారు. వీరిలో ఎక్కువ శాతం మహిళలు, పిల్లలు ఉండడం ఆవేదనకు గురి చేసింది.

‘ఎల్జీపాలిమర్స్‌’ గ్యాస్‌ లీకైన ప్రభావం ఐదు గ్రామాలపై పడింది. వాటిలో పద్మనాభాపురం, వెంకటాపురం, కంపరపాలెం, నందమూరి నగర్‌, ఎస్సీ, బీసీ కాలనీలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో గ్యాస్‌ ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గ్యాస్‌ లీకైన సంఘటనపై ప్రభుత్వం నీరబ్‌కుమార్‌ నేతృత్వంలో ఓ హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు నెలల విచారణ చేపట్టి 319 ఏజీల నివేదికను ప్రభుత్వానికి అందింది. నివాస ప్రాంతంలో ఉన్న ఈ గ్యాస్‌ క్షేత్రాన్ని ఇతర ప్రదేశంలోకి మార్చాలని సూచించింది.

Also Read: వైరల్: ఆరోజుల్లో.. కేటీఆర్ పాత జ్ఞాపకం..

సాధారణగా స్టైరీన్‌ గ్యాస్‌ 5 పీపీఎం(పార్ట్స్‌ ఫరల్‌ మిలియన్‌) స్థాయివరకు ప్రమాదం కాదు. కాని ప్రమాదం జరిగిన రోజు 300 నుంచి 500 పీపీఎం వరకు ఈ రసాయనం విడుదలై ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇది చాలా ప్రమాదకరమైనదని ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ, రసాయన శాస్త్రవేత్త జి. నాగేశ్వర్‌రావు తెలిపారు. అప్పుడు ప్రమాదం కాకపోయినా దీర్ఘకాలికంగా మాత్రం వ్యాధులు తప్పవని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణులపై ఈ గ్యాస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంటున్నారు. విశాఖ ప్రమాదం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ‘ఎల్జీ పాలిమర్స్‌’ గ్యాస్‌ క్షేత్రం ఉన్న చుట్టుపక్కల వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఏ కొంచెం కొత్త స్మెల్‌ వచ్చినా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. మళ్లీ గ్యాస్‌ లీకవుతుందేమోననే భయంతో ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలోని వస్తువులు ఇతరులు కొనడం లేదు.ఆరోగ్యాంగానే కాకుండా ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నామని బాధితులు వాపోతున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular