https://oktelugu.com/

తుదిదశకు చేరుకున్న టీపీసీసీ ఎంపిక.. ఢిల్లీకి రేవంత్ రెడ్డి..!

టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త టీపీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ పదవీపై కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే అధిష్టానం ఎన్నడూ లేనివిధంగా నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..? కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ కొద్దిరోజులు హైదరాబాద్లోనే మకాం వేసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 15, 2020 / 07:58 PM IST
    Follow us on

    టీపీసీసీ పదవీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త టీపీసీసీ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ పదవీపై కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఆశలు పెట్టుకున్నారు. ఈక్రమంలోనే అధిష్టానం ఎన్నడూ లేనివిధంగా నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది.

    Also Read: డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

    కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ కొద్దిరోజులు హైదరాబాద్లోనే మకాం వేసి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తంగా 200మంది కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి ఠాకూర్ విన్నవించినట్లు సమాచారం.

    వీటిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్లు టీపీసీసీ పదవీ తమకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: ఫాంహౌస్ లో కేసీఆర్, కేటీఆర్ ఏకాంత చర్చలు.. ఏం జరుగుతోంది?

    ఇదిలా ఉండగానే కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశంలో రాహుల్‌తోపాటు రేవంత్ పాల్గొనబోతున్నారు.

    రాహుల్ తో రేవంత్ భేటి కానుండటంతో టీపీసీసీ పదవీ రేవంత్ కే దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రేపటిలోగా టీపీసీసీ పదవీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్