https://oktelugu.com/

డిగ్రీ, బీటెక్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

పాల్ టెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్ లైన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలు ఉన్న కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం వల్ల తక్కువ సమయంలో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. Also Read: ఇంగ్లీష్ రాని వారికి శుభవార్త.. ఆన్ లైన్ లో రామ‌కృష్ణ మ‌ఠం ఇంగ్లీష్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 15, 2020 / 07:55 PM IST
    Follow us on


    పాల్ టెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆన్ లైన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలు ఉన్న కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం వల్ల తక్కువ సమయంలో విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

    Also Read: ఇంగ్లీష్ రాని వారికి శుభవార్త.. ఆన్ లైన్ లో రామ‌కృష్ణ మ‌ఠం ఇంగ్లీష్ క్లాసులు..!

    టెక్నాలజీ దిగ్గజ కంపెనీలలో ఒకటైన ఐబీఎం విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ సంస్థతో శిక్షణకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, ఐబీఎం మధ్య కుదిరిన ఈ ఒప్పందం వల్ల ఏకంగా 30,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఐబీఎం సంస్థ భావిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిష్టర్ చేసుకుని శిక్షణ పొందవచ్చు.

    Also Read: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..?

    ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఇతర కోర్సులను విద్యార్థులు ఉచితంగా నేర్చుకోవచ్చు. https://www.ptech.org/open-p-tech/ లింక్ ద్వారా ఆసక్తి ఉన్న విద్యార్థులు శిక్షణ కోసం రిజిష్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు శిక్షణా తరగతులు, ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    అయితే ఈ శిక్షణకు కేవలం 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సులు బయట నేర్చుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.