మోహన్ బాబు నటప్రస్థానానికి నేటితో 45ఏళ్లు పూర్తి..!

సీనియర్ హీరో మోహన్ బాబుకు టాలీవుడ్లో కలెక్షన్ కింగ్ పేరుంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు సినిమా రంగంలో కొనసాగుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా రాణించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. Also Read: బాలయ్యకి ఓ నిర్మాత కావాలి ! మోహన్ బాబు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ […]

Written By: NARESH, Updated On : November 22, 2020 7:27 pm
Follow us on

సీనియర్ హీరో మోహన్ బాబుకు టాలీవుడ్లో కలెక్షన్ కింగ్ పేరుంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా మోహన్ బాబు సినిమా రంగంలో కొనసాగుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా గుర్తింపు పొందిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా రాణించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు.

Also Read: బాలయ్యకి ఓ నిర్మాత కావాలి !

మోహన్ బాబు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించి 50పైగా సినిమాలను నిర్మించారు. అదేవిధంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను స్థాపించి విద్యావేత్తగా మారారు. మోహన్ బాబు హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 560పైగా సినిమాల్లో నటించారు.

మోహన్ బాబు 1975లో సినిమా కెరీర్ ను ప్రారంభించి నేటికి కొనసాగిస్తాడు. ఆయన సినిమా కెరీర్ ప్రారంభమై నేటికి 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు ‘కంగ్రాట్స్ మై హీరో.. నేటితో సినీ కెరీర్ 45ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు గర్వంగా ఉంది’ అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశాడు.

Also Read: కరణ్ జోహర్ పై మరో వివాదం.. టైటిల్ రచ్చ..!

ఒక నిమిషం 32సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో మోహన్ బాబు సినీ కెరీర్ మొత్తంగా టూకీగా చూపించారు. 1975లో ప్రారంభమైన మోహన్ బాబు సినీ కెరీర్ ఈ ఏడాది వరకు చూపించడం ఆకట్టుకుంది. మోహన్ బాబు ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీలో నటించారు.

తాజాగా సన్నాఫ్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. మోహన్ బాబు 45ఏళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకోవడంతో ఆయన తోటి నటీనటులు, రాజకీయ ప్రముఖులకు ఆయనకు అభినందనలు చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్