ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. వైసీపీ ఎంపీ అకాల మరణంతో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నిక జగన్ పాలనకు రెఫరెండంగా మారనుండటంతో వైఎస్సాఆర్సీపీ నుంచి బలమైన అభ్యర్థి బరిలో నిలువడం ఖాయం. ఇక టీడీపీ నుంచి ఇప్పటికే పనబాక లక్ష్మీ బరిలో నిలుచారు.
Also Read: ఆ రాజకీయలకు చంద్రబాబు గుడ్ బై..?
ఇక మిగిలింది కాంగ్రెస్.. బీజేపీ.. జనసేన పార్టీ, వామపక్ష పార్టీలే. ఇందులో కాంగ్రెస్.. వామపక్షాలు పోటీల్లో నిలిచినా నామమాత్రమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ-జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ రెండు పార్టీలు కూడా తమతమ అభ్యర్థులను నిలబెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తిని రేపుతోంది.
ఇదిలా ఉంటే తిరుపతి ఉప ఎన్నిక బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాలుగా మారబోతుంది. బీజేపీ అధిష్టానం తెలుగు రాష్ట్రాల్లో బలపడేందుకు తెలంగాణ.. ఏపీలో ఒకేసారి కొత్త అధ్యక్షులను నియమించింది. తెలంగాణకు బండి సంజయ్ నియామకంకాగా.. ఏపీకి సోము వీర్రాజు అధ్యక్షుడిగా నియామకమయ్యారు.
సోము వీర్రాజు ఏపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక వరుసగా ఏపీకి చెందిన ప్రముఖులను కలుస్తూ వార్తల్లో నిలిచారు. అదేవిధంగా బీజేపీ ఉంటూ టీడీపీ కోవర్టులకు వ్యవహరిస్తున్న వారి పనిబట్టారు. దీంతో ఏపీలో బీజేపీ బలపడుతుందన్నటాక్ విన్పించింది. అయితే ఏపీ కంటే కూడా తెలంగాణలో బీజేపీ బలపడటంతో సోము వీర్రాజుపై క్రమంగా ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.
Also Read: ముందు రైతు.. వెనక మోడీ..!
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార పార్టీకి ప్రతీ ఎన్నికలోనూ గట్టి సవాల్ విసురుతూ ముందుకెళుతున్నాడు. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పై బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అలాగే గ్రేటర్లోనూ టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ కళ్లెం వేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ సైతం సత్తాచాటాల్సిన అవసరం ఏర్పడింది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తే సోము వీర్రాజు నాయకత్వానికి తిరుగుండదనే టాక్ విన్పిస్తోంది. అయితే తిరుపతిలో బీజేపీ వైసీపీ, టీడీపీలతో పొల్చుకుంటే బలహీనంగా ఉండటం ఆ పార్టీకి మైనస్ గా మారింది. ఇప్పటికే టీడీపీ.. వైసీపీలు ప్రచారంలో దూసుకెళుతున్నాయి. అయితే బీజేపీ.. జనసేన పార్టీలు ఎవరినీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో బీజేపీ తిరుపతిలో గెలువకపోయినా కనీసం రెండో స్థానంతో సరిపెట్టుకున్న సోము వీర్రాజు విజయం సాధించినట్లేననే టాక్ విన్పిస్తోంది. బీజేపీ అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తే ఆపార్టీ శ్రేణుల్లో జోష్ రావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికలో ఎలా వ్యూహాలు అవలంభించి సక్సస్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్