‘నా సామ్రాజ్యానికి నేనే రాజు.. నేనే మంత్రి..’ ఇదీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా. ఆయనకు తెలియకుండా రాష్ట్రంలో ఏదీ జరగడానికి కూడా వీల్లేదు. అధికార యంత్రాంగం కూడా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంటుంది. చివరకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆయన చెప్పిందే వేదంగా అమలు చేస్తున్నారు. కొందరు సీనియర్ అధికారులు సైతం టీఆర్‍ఎస్ పార్టీ అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చాయి.
Also Read: ఎంఐఎం, కేసీఆర్ రహస్య దోస్తీని కడిగేసిన అమిత్ షా
అంతేకాదు.. వ్యక్తిగతంగా కలవాలంటే.. ఆయన దర్శనం కూడా దొరకదు. బాధను చెప్పుకోవాలన్నా కనీసం టైం ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏక చక్రాధిపత్యంగా పాలిస్తున్నారనేది వాస్తవం. కేసీఆర్ ఎవరికీ భయపడరు.. మాటల మాంత్రికుడిగా ఆయనకు పేరుంది. ఎవరినీ లెక్కచేయరు. తనపై విమర్శలు, ఆరోపణలు చేసేవారిని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‍పై విమర్శలు, ఆరోపణలు చేయాలంటే.. కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు కూడా వెనకడుగు వేస్తున్నారట. ఆ రెండు పార్టీల కొందరు నాయకులు తన కోవర్టులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చుకున్నారని టీఆర్‍ఎస్ నేతలు అంటుంటారు. అయితే.. నిన్నటి నిజం.
Also Read: కవితకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్
ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‍కు మచ్చెమటలు పట్టే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని 60 ఏళ్లు ఆంధ్రోళ్లు దోచుకున్నారు. తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని అమాయకంగా మలుచుకుని వారి ఆస్తులను అక్రమంగా ఆక్రమించుకున్నారు అనే సెంటిమెంటు రెచ్చగొట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‍ను ముప్పతిప్పలు పెడుతూ.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‍తోపాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రాజకీయంగా, అధికారంగా నిరంకుశత్వంతో ఏక చక్రాధిపత్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‍కు బండి సంజయ్, అరవింద్‍లు దడ పుట్టించారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం: తెలంగాణ పాలిటిక్స్
ఇన్నాళ్లు భయం అంటే తెలియని కేసీఆర్‌కు మొదటి సారి పరిచయం చేశారు. ఈ ఘనత అటు బీజేపీ చీఫ్ సంజయ్.. ఎంపీ అర్వింద్‌దే. గతంలో కేసీఆర్‍పై విమర్శలు, ఆరోపణలు చేయాలంటే.. కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలతోపాటు ఇతర పార్టీ నేతలు ఎంతలా భయపడేవారో అందరికీ తెలిసిందే. ఎక్కడ తమపై కేసులు పెట్టి ఇబ్బంది పెడతారో అన్న ఆందోళనతో ఆ ధైర్యం చేసేవారు కాదు. కొంత మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారని ప్రచారం కూడా జరిగింది. ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్‍కు మాత్రమే కేసీఆర్ గౌరవ మర్యాదలు చేసేవారు. ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్‌లో మాత్రం ఈ ఎన్నికలంటే భయం వాతావరణం సృష్టించాయి. ఆయనను ఎంపీలు బండి సంజయ్, అరవింద్‍లు ఎంత భయపెట్టారో స్పష్టమవుతోంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Those two mps who are intimidating kcr
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com