https://oktelugu.com/

‘బిజినెస్’గా మారిన బొడ్డుతాడు.. ఒకప్పుడు తాయత్తు.. ఇప్పుడు బిజినెస్!

సాధారణంగా ఒక వ్యక్తి తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పటి నుంచి చనిపోయేవరకు వారి జీవితంలో పదహారు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే బిడ్డ పుట్టినప్పుడు పదకొండవ రోజు ఈ కార్యక్రమం చేస్తారు.తల్లి పేగు నుంచి విడిపోయి జన్మించిన బిడ్డ బొడ్డుతాడును పదకొండవ రోజు కత్తిరించి దాన్ని భద్రంగా తాయత్తులో భద్రపరిచి శిశువు మొలతాడుకు కట్టేవారు. ఇది మన హిందూ సాంప్రదాయాలలో ఒక ఆచారంగా వస్తోంది. అయితే రాను రాను ఈ ఆచారం కనుమరుగైపోయింది. దీనిని ప్రస్తుత కాలంలో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 14, 2020 6:42 pm
    Follow us on

    సాధారణంగా ఒక వ్యక్తి తల్లి గర్భంలో జీవం పోసుకున్నప్పటి నుంచి చనిపోయేవరకు వారి జీవితంలో పదహారు కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే బిడ్డ పుట్టినప్పుడు పదకొండవ రోజు ఈ కార్యక్రమం చేస్తారు.తల్లి పేగు నుంచి విడిపోయి జన్మించిన బిడ్డ బొడ్డుతాడును పదకొండవ రోజు కత్తిరించి దాన్ని భద్రంగా తాయత్తులో భద్రపరిచి శిశువు మొలతాడుకు కట్టేవారు. ఇది మన హిందూ సాంప్రదాయాలలో ఒక ఆచారంగా వస్తోంది. అయితే రాను రాను ఈ ఆచారం కనుమరుగైపోయింది. దీనిని ప్రస్తుత కాలంలో ఒక వ్యాపారంగా స్థాపించి కోట్లలో వ్యాపారం చేస్తున్నారు.

    తల్లి గర్భం నుంచి విడిపోయిన బొడ్డు కణంలో ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే కణాలు ఉండటం ద్వారా వాటిని జాగ్రత్తగా భద్రపరిచి దాచేవారు. ఈ బొడ్డును బట్టి వారి జీవితంలో ఏ సమస్యలను ఎదుర్కొంటారో కూడా క్షుణ్ణంగా చెప్పగలరు. పూర్వకాలంలో అంతుచిక్కని వ్యాధితో బాధపడేవారికి ఈ బొడ్డును నాకిస్తే రోగం నయమయ్యేదని, ఎలా రోగం నయం అయిందంటే అంతా తాయెత్తు మహిమ అని చెప్పేవారు.

    ఈ బొడ్డుతాడును ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు వెండి, రాగి తాయత్తులలో భద్రపరిచేవారు. ప్రస్తుతం ఈ మూల కణాల ద్వారా వారి జీవితంలో ఎదురయ్యే క్యాన్సర్, జుట్టు ఊడిపోవడం, కిడ్నీ, రక్త సంబంధిత వ్యాధులకు సైతం నయం చేయవచ్చని మన పూర్వీకులు విశ్వసించేవారు.ప్రస్తుతమున్న సాంకేతిక టెక్నాలజీలను ఉపయోగించి ఈ మూలకణాలను లాకర్లలో దాచడం కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.

    పూర్వ కాలంలో ఇలాంటి బ్యాంకులు ఏమీ లేకుండా కేవలం ఎవరు బొడ్డుతాడును వారి మొలకు చుట్టుకొనేవారు.ప్రస్తుతం కాలంలో రోగం వస్తుందో రాదో తెలియదు కానీ రోగం పేరు మాత్రం చెప్పి ఇలాంటి మూలకణాలను దాచడానికి కోట్లలో డబ్బులు వసూలు చేయడం ఎంతో బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు.