
టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే ఉంటారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎవర్ని ఎంపిక చేసినా అంతా కలిసి పనిచేస్తామని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంపై చర్చించేందుకు సోనియా, రాహుల్ గాంధీలను కలిసేందుకు ప్రయత్నిస్తు్న్నామని.. అనుమతి రాగానే దిల్లీ వెళ్తామని చెప్పారు.