https://oktelugu.com/

బీజేపీకి అసలైన పరీక్ష నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. సత్తా చాటుతుందా?

  తెలంగాణ సెంటిమెంట్ కు ఇక కాలం చెల్లినట్లే కన్పిస్తోంది. గత ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ఆడిందే ఆట..పాడిందే పాటగా నడిచింది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మొన్నటి దుబ్బాక.. నిన్నటి జీహెచ్ఎంసీ ఫలితాలు దీనికి నిదర్శనంగా కన్పిస్తున్నాయి. Also Read: టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఆపార్టీది గాలివాటమంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 5, 2020 / 11:08 AM IST
    Follow us on

     

    తెలంగాణ సెంటిమెంట్ కు ఇక కాలం చెల్లినట్లే కన్పిస్తోంది. గత ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ ఆడిందే ఆట..పాడిందే పాటగా నడిచింది. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మొన్నటి దుబ్బాక.. నిన్నటి జీహెచ్ఎంసీ ఫలితాలు దీనికి నిదర్శనంగా కన్పిస్తున్నాయి.

    Also Read: టీఆర్ఎస్ మేయర్ వ్యూహం ఏంటి?

    పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ సీట్లు గెలిస్తే ఆపార్టీది గాలివాటమంటూ టీఆర్ఎస్ నేతలు కొట్టిపారేశారు. దానికి సమాధానంగా బీజేపీ నేతలు దుబ్బాక ఉప ఎన్నికలో అధికార పార్టీనే ఓడించి గట్టి సమాధానమిచ్చారు. ఈ ఎన్నిక అయిన వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి.

    జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్.. బీజేపీ మధ్య హోరాహోరాగా నడిచింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని తన సర్వ సైన్యాన్ని హైదరాబాద్లో దింపితే బీజేపీ సైతం జాతీయ నేతలను.. కేంద్రమంత్రులను రంగంలోకి దింపింది. దీంతో ఫలితాలు వచ్చే సారికి టీఆర్ఎస్ కు 55స్థానాలు బీజేపీ 48స్థానాలు దక్కాయి. అంటే వీరి మధ్య కేవలం 7సీట్లు మాత్రమే తేడా.

    2016లో కేవలం మూడు స్థానాలకే పరిమితమైన బీజేపీ 2020నాటికి 45స్థానాలను అధికంగా పెంచుకుందంటే ఆ పార్టీ నగరంలో ఏమేరకు విస్తరించిందనేది అర్థం చేసుకోవచ్చు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నిక ముగియడంతో బీజేపీ నేతలు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ బీజేపీ ఆకర్ష్ ప్రారంభమైందని సమాచారం.

    Also Read: ఉత్తమ్‌ రిజైన్.. పీసీసీ ఎవరికి?

    నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక కోసం బీజేపీ బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డికి బీజేపీ గాలం వేస్తోంది. అతడు బీజేపీలో చేరితే ఉప ఎన్నికలో సీటు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరకపోతే ఆ స్థానంలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపాలని ఆలోచిస్తుందని సమాచారం.

    టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న బీజేపీ రానున్న నాగార్జున్ సాగర్లో  ఉప ఎన్నికలో సైతం సత్తాచాటాల్సిన అవసరం ఉంది. దుబ్బాక.. జీహెచ్ఎంసీ ఫలితాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగార్జున్ సాగర్లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో వారికే వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కలిసొచ్చే అవకాశాలు మొండుగా ఉన్నాయి. దీంతో నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు అసలైన పరీక్షగా మారబోతుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్