వివాదాల వర్మ సైలెంట్‌గా ఉంది అందుకే !

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్, దిశ’ సినిమాలు కోర్టు కేసులతో ఆగిపోయాయి. అమృత, దిశ కుటుంబ సభ్యులు రామ్ గోపాల్ వర్మకి గట్టిగానే లీగల్ షాకులిచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే, ఈ మధ్య పబ్లిసిటీ స్టంట్స్ బాగా తగ్గించాడు వర్మ. లాభం లేకపోతే ఏ పని చేయను అని చెప్పే వర్మ.. మొత్తానికి తన సినిమాల వల్ల లాభం లేదని డిసైడ్ అయినట్లు ఉన్నాడు. ఎంతోమందిని బాధ పెట్టి సినిమా తీసినా.. పెట్టుబడులు కూడా రావట్లేదని […]

Written By: admin, Updated On : December 5, 2020 11:01 am
Follow us on


వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్, దిశ’ సినిమాలు కోర్టు కేసులతో ఆగిపోయాయి. అమృత, దిశ కుటుంబ సభ్యులు రామ్ గోపాల్ వర్మకి గట్టిగానే లీగల్ షాకులిచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే, ఈ మధ్య పబ్లిసిటీ స్టంట్స్ బాగా తగ్గించాడు వర్మ. లాభం లేకపోతే ఏ పని చేయను అని చెప్పే వర్మ.. మొత్తానికి తన సినిమాల వల్ల లాభం లేదని డిసైడ్ అయినట్లు ఉన్నాడు. ఎంతోమందిని బాధ పెట్టి సినిమా తీసినా.. పెట్టుబడులు కూడా రావట్లేదని వర్మ బాధ. ఏది ఏమైనా వర్మ.. వివాదాస్పద అంశాలకు కూడా గత కొన్నిరోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. మరి వర్మలోని ఈ మార్పు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి.

Also Read: మెగాస్టార్ కోసం ప్రత్యేక సెట్.. సాంగ్స్ ను కూడా.. !

అన్నట్లు వర్మ సైలెంట్ గా ఉండటానికి కారణం.. వర్మ కొత్త అవతారం ఎత్తబోతున్నాడని… ఆయనగారు కొత్తగా నటుడిగా మారబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఆర్జీవీ నటించబోయే సినిమా పేరు ‘కోబ్రా’ అని.. ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆర్జీవీనే వహించనున్నాడని.. ప్రస్తుతం వర్మ.. ఈ సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడని.. త్వరలోనే సినిమా షూట్ కూడా మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా బిజీ వల్లే వర్మ.. కొత్త వివాదాలకు దూరంగా ఉంటున్నాడట. మొత్తానికి వర్మ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా రానిస్తాడేమో చూడాలి.

Also Read: ఆ యంగ్ డైరెక్టర్ కు మహేష్ చాన్స్?

నిజానికి గత ఏడాదే ఆర్జీవీ నటించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరకు వర్మ ‘కోబ్రా’లో నటించబోతున్నాడు. మరి ఈ సినిమాలో వర్మ ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తున్నాడా ? లేక, గెస్ట్ రోల్ చేస్తున్నాడా ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని కూడా వర్మ తన ఓన్ బ్యానర్ గన్ షాట్ ఫిలిమ్స్ బ్యానర్ పైనే నిర్మించనున్నాడని సమాచారం. మొత్తంమీద రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను కంటిన్యూ చేయకుండా కొత్త పంథా ఎంచుకున్నాడు అన్నమాట.”

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్