https://oktelugu.com/

థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం రాబోతుందా?

దశాబ్దాలుగా ప్రజల జీవితాలలో సినిమా థియేటర్ అనేది ఒక భాగంగా ఉంటూ వస్తుంది. అభిమాన హీరో సినిమా కోసం భారీ కటవుట్స్ కట్టి, టపాసులు పేల్చి, మొదటి టికెట్ కోసం చొక్కాలు చించుకోవడం సినిమా థియేటర్ వద్దనే చూడగలం. అలాంటి సినిమా థియేటర్స్ ఏడు నెలలు పైగా మూగబోయాయి. వెండి తెరపై బొమ్మపడి నెలలు అవుతుండగా, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా సంభవించిన ఈ గడ్డు పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయటపడే […]

Written By:
  • admin
  • , Updated On : December 5, 2020 11:11 am
    Follow us on

    AMB Theaters Opening
    దశాబ్దాలుగా ప్రజల జీవితాలలో సినిమా థియేటర్ అనేది ఒక భాగంగా ఉంటూ వస్తుంది. అభిమాన హీరో సినిమా కోసం భారీ కటవుట్స్ కట్టి, టపాసులు పేల్చి, మొదటి టికెట్ కోసం చొక్కాలు చించుకోవడం సినిమా థియేటర్ వద్దనే చూడగలం. అలాంటి సినిమా థియేటర్స్ ఏడు నెలలు పైగా మూగబోయాయి. వెండి తెరపై బొమ్మపడి నెలలు అవుతుండగా, థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా సంభవించిన ఈ గడ్డు పరిస్థితి నుండి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నం జరుగుతుంది.

    Also Read: వివాదాల వర్మ సైలెంట్‌గా ఉంది అందుకే !

    హైదరాబాద్ లోని కొన్ని మల్టీఫ్లెక్స్ లు తెరుచుకోవడం జరిగింది. మహేష్ బాబు భాగస్వామ్యంతో నడుస్తున్న ఏఎంబి ముల్టీఫ్లెక్స్ అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆంగ్ల చిత్రం టెనెట్ మూవీ నిన్న విడుదల అయ్యింది. ఈ చిత్రం నిన్న హైదరాబాద్ లోని అనేక థియేటర్స్ లో ప్రదర్శించడం జరిగింది. ప్రసాద్ ఐ మాక్స్ లో ఈ చిత్రాన్ని హీరో సాయి ధరమ్ తేజ్ వీక్షించారు. ఆయన స్వయంగా థియేటర్ కి వెళ్లిన వీడియో, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా భయం వీడి అందరూ సినిమా థియేటర్స్ పట్ల మునుపటి అభిప్రాయం కలిగేలా అవగాహనా కల్పించారు.

    Also Read: తన కాళ్లు పట్టుకున్నవారెవరో తెలిపిన నిహారిక !

    అలాగే థియేటర్స్ కి వెళ్లే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశాడు. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా థియేటర్ కి వెళ్లి సినిమా వీక్షించడం జరిగింది. మరో వైపు టాలీవుడ్ హీరోలు వరుసగా తమ చిత్రాల విడుదలకు ప్రణాళిక వేస్తున్నారు. సాయి ధరమ్ లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఈ నెలలో విడుదల కానుంది. అలాగే రానా పాన్ ఇండియా మూవీ అరణ్య సైతం, విడుదల కానున్న చిత్రాల లిస్ట్ లో ఉంది. తాజా పరిస్థితులు చూస్తుంటే థియేటర్స్ కి గత వైభవం రావడం ఖాయం అనిపిస్తుంది. ప్రేక్షకులతో థియేటర్స్ సందడిగా మరే సూచనలు కనిపిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్