https://oktelugu.com/

హైదరాబాదీల మొద్దు నిద్ర.. ఓటు వేయట్లేదే?

‘తెల్లారిందోయ్.. మామ.. మామ..’ అని ఇప్పుడు హైదరాబాద్ అంతా ప్రచారం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే హీరోలు కూడా రంగంలోకి దిగారు. తాజాగా సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ హైదరాబాదీలకు వీడియోలు రిలీజ్ చేసి పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు., పోసాని పిలుపునిచ్చారు. స్టార్ యాంకర్ సుమ అవగాహన కల్పించారు. జర కదలండి.. ఓటు వేయండని హితబోధ చేశారు. Also Read: ఈసారి కూడా టీఆర్ఎస్ సెంచరీ మిస్ అయినట్టేనా? తెలంగాణ అంతా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2020 6:17 pm
    Follow us on

    ‘తెల్లారిందోయ్.. మామ.. మామ..’ అని ఇప్పుడు హైదరాబాద్ అంతా ప్రచారం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే హీరోలు కూడా రంగంలోకి దిగారు. తాజాగా సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ హైదరాబాదీలకు వీడియోలు రిలీజ్ చేసి పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు., పోసాని పిలుపునిచ్చారు. స్టార్ యాంకర్ సుమ అవగాహన కల్పించారు. జర కదలండి.. ఓటు వేయండని హితబోధ చేశారు.

    Also Read: ఈసారి కూడా టీఆర్ఎస్ సెంచరీ మిస్ అయినట్టేనా?

    తెలంగాణ అంతా నిద్ర లేచినా.. ఇంకా హైదరాబాదీ ఓటరు మాత్రం నిద్ర లేవడం లేదు. ఆ మొద్దు నిద్రకు చెక్ చెప్పడం లేదు.. ప్రతిసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 35-50శాతం లోపే ఉంటుంది. అంటే 100శాతంలో సగం మంది ఓటు వేయడం లేదన్నమాట.. ఎంత దారుణం.. గెలిపించే వారు ఆ 40శాతంలో 20శాతం మందేనన్న మాట.. 20శాతం మంది హైదరాబాదీలు తమ పాలకులను ఎన్నుకోవడం అంటే అంతకంటే ధౌర్భాగ్యం మరొకటి ఉండదు.

    తాజాగా హైదరాబాద్ లో మందకొడిగా పోలింగ్ సాగుతోంది. ఎంత మందకొడి అంటే ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం కేవలం 3.10 శాతం మాత్రమే.. రెండు గంటల్లో ఇంత తక్కువ ఓటింగ్ శాతం అంటే హైదరాబాదీలు కదిలిరావడం లేదన్న మాటే..

    హైదరాబాద్ అంటే మహానగరం.. ఇక్కడ దేశ విదేశాల నుంచి వచ్చి నివాసం ఉంటారు. సంపద ఎక్కువ. అందరూ విద్య, ఉద్యోగాలతో బిజీగా ఉంటారు. క్షణం తీరిక ఉండదు. లక్షలు వస్తాయి. అందుకే ఈ బిజీలో అస్సలు ఓటు వేయడానికి హైదరాబాదీలు ఇష్టపడడం లేదు. కొందరు బద్దకంతో అటు వైపే చూడరు. అరే మన పాలకులు.. మనం ఓటేస్తే గెలుస్తారన్న సృహ కనీసం ఉండదు. అందుకే తెల్లారి పొద్దు గడుస్తున్నా ఇంకా ఓటు వేయడానికి హైదరాబాదీలు కదలడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

    Also Read: గ్రేటర్‌‌ వాసులు ఎందుకు ఓటు వేయరు..?

    విద్యార్థులు, ఉద్యోగులు, సంపన్నవర్గాలు ఓట్లు వేయకపోవడంతో ఇక పేదలు, మధ్యతరగతి, రోజువారి కూలీలు మాత్రం ఓటు వేయడానికి క్యూ కడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే పేదలు ఉండే బస్తీల్లోనే అత్యధిక పోలింగ్ నమోదవుతోంది. ఇది టీఆర్ఎస్ కే అనుకూలం అన్న ప్రచారం సాగుతోంది. మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎలాగూ బీజేపీకే సపోర్టుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కు అనుకూలమైన ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. సెలెబ్రెటీలు ఉండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో అస్సలు ఓటు వేయడానికి రావట్లేదు.

    వరదలు వచ్చినప్పుడు అందరూ టీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లను నిలదీశారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కడిగేశారు. మరి అలా అడగాలంటే ముందు ఓటు వేయాలి. అదే బ్రహ్మస్త్రం.. పనిచేసే వారికే ఓటు వేయండి.. మీ ఆయుధాన్ని వాడుకోండి. మెరుగైన నేతలను.. పనిచేసే వారికి పట్టం కట్టండి తద్వారా హైదరాబాద్ ను నిర్మించండి అంటూ తాజాగా స్టార్ హీరోలు సైతం పిలుపునిచ్చారు. అయితే ఉదయం 9 గంటల వరకు 3.10శాతం మాత్రమే పోలింగ్ నమోదైన దృష్ట్యా హైదరాబాదీలు మరోసారి పోలింగ్ బూత్ లకు వచ్చేందుకు బద్దకిస్తున్నారనే విషయం తేటతెల్లమైంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    -నరేశ్