https://oktelugu.com/

పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీడియా?

పోటీ ప్రపంచంలో ఏ రంగంలో అయినా పోటీ కామన్‌. అయితే.. ఈ పోటీ ఏ రంగంలో అయినా బాగానే ఉంటుంది కానీ మీడియా రంగంలోనూ కనిపించే సరికి అనారోగ్యకర వాతావరణానికి దారితీస్తోంది. మీడియా అంటే.. సమాజంలోని వార్తలను సేకరించి ప్రజల ముందుంచాలి. కానీ.. బ్రేకింగ్‌ల కోసం పోటీపడి ఏం ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఒకప్పుడు ప్రజా సమస్యల కోసం అన్నట్లు నడిచిన మీడియా హౌస్‌లు ఇప్పుడు పూర్తిగా వ్యాపార దృక్పథంలో ఆలోచిస్తున్నాయి. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2020 / 10:11 AM IST
    Follow us on

    పోటీ ప్రపంచంలో ఏ రంగంలో అయినా పోటీ కామన్‌. అయితే.. ఈ పోటీ ఏ రంగంలో అయినా బాగానే ఉంటుంది కానీ మీడియా రంగంలోనూ కనిపించే సరికి అనారోగ్యకర వాతావరణానికి దారితీస్తోంది. మీడియా అంటే.. సమాజంలోని వార్తలను సేకరించి ప్రజల ముందుంచాలి. కానీ.. బ్రేకింగ్‌ల కోసం పోటీపడి ఏం ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఒకప్పుడు ప్రజా సమస్యల కోసం అన్నట్లు నడిచిన మీడియా హౌస్‌లు ఇప్పుడు పూర్తిగా వ్యాపార దృక్పథంలో ఆలోచిస్తున్నాయి.

    Also Read: జగన్ నమ్మిన ఆ అధికారి ఎవరో తెలుసా?

    సరే.. అది ఎలా ఉన్నా.. ఏదైనా క్రైం సంఘటన జరిగిన వెంటనే మీడియా కొంత సంయమనం పాటించాలని పోలీసులు కోరుతున్నా పట్టించుకునేవారు లేరు. దీనికి తోడు దర్యాప్తు సంస్థలతోపాటు సమాంతర దర్యాప్తు తెలిసీ తెలియని అంశాలతో సాగిస్తున్నారు. ఇది సమాజానికి ప్రమాదకరంగా మారుతోంది. ఇటీవల జరిగిన అనేక కేసులతోపాటు తాజాగా జరిగిన దీక్షిత్ కిడ్నాప్ కేసు కూడా మీడియా బాధ్యత రాహిత్యంగా ప్రసారం చేయడంతో చర్చనీయాంశం అయింది.

    ఏదైనా కిడ్నాప్‌ జరిగినప్పుడు పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు మీడియాలో ఇస్తున్నారు. దీంతో నిందితులు వాటిని గమనిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమాచారం వెంటవెంటనే తెలుసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. అంతేకాదు.. ఎక్కడ దొరికిపోతామోనని ఆధారాలు లేకుండా చేస్తున్నారు. ఇలా చాలా వరకు కేసుల్లో జరిగింది. ఎలాంటి సాక్షాలు లేక చాలా వరకు కేసుల్లో నిందితులు నిర్దోషులుగా బయటకు వచ్చారు. ఇదంతా మీడియా అత్యుత్సాహం వల్లే జరుగుతోందంటూ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల కేసులను దర్యాప్తు చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. అంతోఇంతో టెక్నాలజీని పట్టుకొని కేసులు ఛేదిస్తున్నామని.. లేదంటే ఈ మీడియాలో వస్తున్న అప్‌డేట్స్‌తో దొంగలు రాష్ట్రాలు దాటిపోయే ప్రమాదాలు పొంచి ఉన్నాయని అంటున్నారు.

    Also Read: కేసీఆర్‌.. మొదటిసారి ఒక్క అడుగు వెనక్కి..!

    అయితే.. ప్రస్తుతం ఈ మీడియాకు సోషల్‌ మీడియా కూడా తోడైంది. ఏదేని ఏరియాలో ఏదైనా ఘటన జరిగితే క్షణాల్లో సమాచారాన్ని షేర్‌‌ చేస్తున్నారు. సంఘటన స్థలంలో బయట పెట్టకూడని అనేక కీలక అంశాలను కూడా సోషల్‌ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ప్రధాన మీడియాలో వార్త వచ్చే సమయానికే సోషల్ మీడియాలో చర్చలు కూడా పూర్తవుతున్నాయి. ఈ ధోరణికి ఎలా చెక్ పెట్టాలన్న అంశం ఇప్పుడు పోలీసులు చాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలో సైతం కౌన్సిలింగ్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.