‘నయనతార’ పై ఆరోపణలకు కారణం అదే !

లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. పైగా వయసు ముదిరిపోయిన తరువాత కూడా అత్యధిక పారితోషికం తీసుకోవడం కూడా ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటి పోటీ ప్రపంచంలో ప్రపంచ సుందరీమణులే ఫేడ్ అవుట్ అయ్యాక, లేక ట్రాక్ తప్పాక అడ్రెస్ లేకుండా పోతున్నారు. కానీ నయనతార విషయంలో మాత్రం అన్ని ప్రత్యకంగానే జరుగుతున్నాయి. కెరీర్ పోయింది అనుకున్న ప్రతిసారి ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. పైగా అందరి […]

Written By: admin, Updated On : April 2, 2021 10:26 am
Follow us on


లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. పైగా వయసు ముదిరిపోయిన తరువాత కూడా అత్యధిక పారితోషికం తీసుకోవడం కూడా ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటి పోటీ ప్రపంచంలో ప్రపంచ సుందరీమణులే ఫేడ్ అవుట్ అయ్యాక, లేక ట్రాక్ తప్పాక అడ్రెస్ లేకుండా పోతున్నారు. కానీ నయనతార విషయంలో మాత్రం అన్ని ప్రత్యకంగానే జరుగుతున్నాయి. కెరీర్ పోయింది అనుకున్న ప్రతిసారి ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి. పైగా అందరి కంటే ఎక్కువ పారితోషికం అడుగుతున్నా.. మేకర్స్ కి మాత్రం నయనతార అంటేనే అభిమానం.

మరి ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ను పెట్టి సోలోగా సినిమా చేస్తే, అది హిట్ అవ్వడం అత్యాశే. కానీ నయనతార చేస్తోన్న సినిమాలు అన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే నయనతారకి ఉన్న ఇమేజ్ ను తరుచుగా తమ స్వార్ధానికి ఎవరో ఒకరు వాడుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కొందరు రాజకీయనాయకులు, నటులు నయనతారను గతంలో చాల సార్లు టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు.

రాధారవి అనే తమిళ సీనియర్ నటుడు గతంలో నయనతార క్యారెక్టర్ గురించి బ్యాడ్ కామెంట్స్ చేసి మొత్తానికి అప్పుడు సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అయి విపరీతమైన ట్రోలింగ్ తో నలిగిపోయాడు. అయినా ఈ రాధారవి అనే అతను మళ్ళీ నయనతార పై అలాంటి కామెంట్సే చేశాడు. “ఉదయనిధికి, నయనతారకి ఎటువంటి సంబంధం ఉన్నా నాకు అనవసరం,” అంటూ ఉదయనిధితో నయనతారకి సంబంధం ఉంది అన్నట్టు చెప్పుకొచ్చాడు.

అసలు రాధారవి, నయనతారను ఎక్కువుగా టార్గెట్ చేయడానికి కారణం.. వాళ్లిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన అట. శింబు – నయనతార హీరోహీరోయిన్లుగా వచ్చిన ఒక సినిమాకి రాధారవి సహా నిర్మాతగా ఉన్నాడని.. అప్పుడు నయనతార చేసిన డిమాండ్స్ కి అప్పట్లో ఆయన ఆమె పై సీరియస్ అయ్యాడని.. దాంతో నయనతార రెండు రోజులు షూటింగ్ కూడా హాజరు కాలేదు అని, దాంతో కొంత డబ్బు నష్టపోయిన రాధారవి, అప్పటి నుండి నయనతారను అవకాశం దొరికినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్