
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లతో టెస్ట్ సిరీస్ లలో పంచిన మజాను మించి ఇప్పుటు ధనాధన్ ఆటకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే నంబర్ టీ20గా ఉన్న ఇంగ్లండ్ తో టీమిండియా టీ20 సిరీస్ కు సిద్ధమైంది. ఈ వేసవిలోనే ఐపీఎల్ ఉండడంతో ఇప్పుడు ఈ సిరీస్ పై దృష్టి నెలకొంది. ఆటగాళ్ల రాణింపుపైనే వచ్చే ప్రపంచ టీ20 కప్ లో ఆటగాళ్లకు చోటు దక్కడం ఆధారపడింది.
ప్రపంచంలోనే నంబర్ 1 జట్టు ఇంగ్లండ్ తో స్వదేశంలో టీమిండియా టీ20 సమరానికి కీలక ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది. 5 టీట్వంటీల సమరానికి ఉవ్విళ్లూరుతోంది.
Also Read: టీ 20 వరల్డ్‌కప్ జట్టులో భారీ మార్పులు..?
ఇక ఓపెనర్ల పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు. ఈ సిరీస్ లో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ కు తోడుగా శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయడని.. కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ను ఆరంభిస్తాడని కెప్టెన్ కోహ్లీ స్పష్టం చేశాడు. గత కొన్ని మ్యాచ్ లుగా రోహిత్-రాహుల్ జోడి అదిరే ఆరంభాలను ఇచ్చిందని.. ఇదే జంటను ఇంగ్లండ్ తో సిరీస్ లో కొనసాగిస్తున్నట్టు కోహ్లీ తెలిపాడు. దీన్ని బట్టి స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. రోహిత్-రాహుల్ లో ఎవరైనా ఒకరు గాయపడితేనే శిఖర్ కు ఛాన్స్ అని తెలిపాడు.
Also Read: వీడియో వైరల్: పాండ్యా, కేఎల్ రాహుల్ మెరుపులు.. కోహ్లీ, శాస్త్రి షాక్
ఇక నాలుగో స్థానం కోసం శ్రేయాస్ అయ్యార్ , సుర్యకుమార్ యాదవ్ పోటీపడుతున్నారు. అనుభవం దృష్ట్యా శ్రేయాస్ కు చాన్స్ ఉండొచ్చు. ఇక పంత్, హార్ధిక్ పాండ్యా తుదిజట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
2019 డిసెంబర్ నుంచి గాయాలతో టీమిండియాకు దూరమైన భువనేశ్వర్ జట్టు బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. బుమ్రా, షమీలాంటి స్టార్ బౌలర్లు లేకపోవడం.. నటరాజన్ గాయంతో వైదొలగడంతో భువీ కీలకంగా మారనున్నాడు. శార్ధుల్ కూడా ఇందులో ఆడే చాన్స్ కనిపిస్తోంది. ఇక చాహల్ కు జతగా స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ లలో ఒకరికి చాన్స్ దక్కొచ్చు.
ఇక మొతేరా బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని.. ఈసారి స్పిన్ తో కూడిన బ్యాటింగ్ వికెట్ పై పరుగుల వరద ఖాయమని అంటున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులతో ఎదురుచూస్తున్నారు.
Comments are closed.