చంద్రబాబూ.. రైతు వేశం.. సూట్ అవ్వలా?

అదేందో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబును చూస్తే హైటెక్ బాబు అని మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే దివంగత వైఎస్ఆర్ ను చూస్తే అచ్చ తెలుగు రైతు గుర్తుకు వస్తారు. వారి పాలన తీరు కూడా అలాగే సాగిందనుకోండి. వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా మారితే సాఫ్ట్ వేర్, హైటెక్ పొంగులంటూ చంద్రబాబు హైటెక్ బాబు అయ్యాడు. Also Read: ఆ మూడు చానెళ్లకు జగన్ సర్కార్ షాక్ అయితే ఆశ్చర్యకరంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా […]

Written By: NARESH, Updated On : November 30, 2020 3:32 pm
Follow us on

అదేందో కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబును చూస్తే హైటెక్ బాబు అని మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే దివంగత వైఎస్ఆర్ ను చూస్తే అచ్చ తెలుగు రైతు గుర్తుకు వస్తారు. వారి పాలన తీరు కూడా అలాగే సాగిందనుకోండి. వైఎస్ఆర్ రైతు పక్షపాతిగా మారితే సాఫ్ట్ వేర్, హైటెక్ పొంగులంటూ చంద్రబాబు హైటెక్ బాబు అయ్యాడు.

Also Read: ఆ మూడు చానెళ్లకు జగన్ సర్కార్ షాక్

అయితే ఆశ్చర్యకరంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా చంద్రబాబు ఆశ్చర్యపరిచాడు. ఎవ్వరూ ఊహించని విధంగా రైతుగా మారి రైతుల కోసం నిరసన చేపట్టారు. ఇది చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు.

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈసారి అసెంబ్లీకి టీడీపీ ప్రజాప్రతినిధులు వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ధర్నా చేపట్టింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చంద్రబాబు రైతులా మారి రైతు వేశంలో ర్యాలీగా రావడం విశేషం. పలు నినాదాలు చేశారు. తడిచిన వరి కంకులతో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. 20 అంశాలపై వెరైటీ ఎంట్రీ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేసింది. తన పాలనలో రైతులను అస్సలు పట్టించుకోని చంద్రబాబు ఇలా రైతుగా రావడం చూసి పలువురు సెటైర్లు వేశారు.

Also Read: నేటి నుంచి సభాసమరం.. కొట్లాట దేనిపైనంటే?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే… ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రజాప్రతినిధులకు సంతాప తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం చేసింది. టీడీఎల్పీ ఉప నేత నిమ్మల రామానాయుడు వాయిదా తీర్మానం చేశారు. తుఫాను సందర్భంగా రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ తీర్మానంలో టీడీపీ పేర్కొంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం: ఏపీ పాలిటిక్స్

ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక అంశాలు చర్చకు పెట్టింది. ఉపాధి హామీ బకాయిలు, టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇసుక పాలసీ, ఇళ్ల పట్టాల్లో అవినీతి, పోలవరం, స్థానిక ఎన్నికలపై చర్చించనున్నారు.