ఇన్నాళ్లు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఇలా పిటీషన్ వేయగానే అలా ఆయనకు అనుకూలంగా తీర్పులు వచ్చేవన్న ఆరోపణలు వైసీపీ నేతలు చేసేవారు. కానీ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మారడం.. కొత్త చీఫ్ జస్టిస్ రావడం.. అంతకుముందు సీఎం జగన్ వీరిపై లేఖ రాయడంతో కథ అంతా మారిందంటున్నారు.
Also Read: హైదరాబాద్ లో పెరుగుతున్న ఇళ్ల ధరలు.. కారణమేంటంటే..?
ఈ క్రమంలోనే తాజాగా తొలిసారి నిమ్మగడ్డ ఏపీ ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన నోటిఫికేషన్ ను సింగిల్ జడ్జి కొట్టివేయగా.. ఈరోజు డివిజన్ బెంచ్ లో కూడా నిమ్మగడ్డకు అనుకూలంగా ఏం సడెన్ తీర్పు రాలేదు. ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీలు కోసం డివిజన్ బెంచ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలపై నిమ్మగడ్డ 8న షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నిక్లలను నిర్వహించలేమని ఈ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.రెండుగంటల పాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్ కష్టమవుతుందని ఏజీ కోర్టుకు వివరించారు.
Also Read: చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. పెరుగుతున్న కేసులు..?
ఈ క్రమంలోనే ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేసింది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ అభిప్రాయాన్ని ఎస్ఈసీ పరిగణలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ నిర్ణయం ఆర్టికల్స్ 14, 21 ని ఉల్లంఘించినట్టు తెలిపింది.
దీంతో నిమ్మగడ్డ డివిజన్ బెంచ్ లోనూ చుక్కెదురేనని అర్థమవుతోంది. దీన్ని బట్టి మరోసారి షాక్ తప్పదని అర్థమవుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్