Homeఅత్యంత ప్రజాదరణనగరాన్ని శాసిస్తున్న వీధి కుక్కలు.. పట్టించుకునే వారేరీ?

నగరాన్ని శాసిస్తున్న వీధి కుక్కలు.. పట్టించుకునే వారేరీ?

తెలంగాణకు ఆయువుపట్టు లాంటి భాగ్యనగరాన్ని వీధికుక్కలు శాసిస్తున్నాయంటే అతిశయోక్తిగా అనిపిస్తుందో ఏమోగానీ.. ఇదే నిజమని నగరవాసులు బల్లగుద్ది చెబుతున్నారు. ఎందుకంటే నగరంలో వీధి కుక్కలను కట్టడి చేయడలంలో జీహెచ్ఎంసీ.. ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా  విఫలమయ్యాయని నగరవాసులు విమర్శిస్తున్నారు.

నగరంలోని బస్తీలు.. కాలనీల్లో వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ దాడికి పాల్పడుతున్నాయి. దీంతో కుక్కల దాడిలో గాయపడుతున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. సగటున రోజుకు 30మంది బాధితులు ఫీవర్ ఆస్పత్రికి వెళుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఎక్కువగా చిన్నపిల్లలే ఉండటం శోచనీయంగా మారింది.

కుక్కలు ఏడాది రెండు రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో కుక్క ఏడాదిలో 40కుక్కల వరకు జన్మినిచ్చే అవకాశం ఉంది. దీంతో వీటి సంఖ్య నగరంలో రోజురోజుకు పెరిగిపోతుంది. గత ఆగస్టు 15నాటికి నగరంలో కుక్కల సంఖ్య తేల్చాలని వెటర్నరీ అధికారులు భావించారు. అయితే కరోనా కారణంగా ఆ సర్వే అటకెక్కినట్లు కన్పిస్తోంది.

దీంతో నగరంలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయో సరైన లెక్కల అధికారుల వద్ద లేకుండా పోయాయి. వెటర్నరీ అధికారులు శునకాలకు సంతాన నిరోధక టీకాలు వేసి వాటి సంఖ్య తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆచరణకు మాత్రం రావడం లేదు. వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతుండటంతో నగర వాసులకు కుక్క కాట్లు తప్పడం లేదు.

ఇక నగరంలో రాత్రివేళ కుక్కల బెడుద ఎక్కువగా ఉంటుందని సమాచారం. వాహనదారుల వెంట కుక్కలు పడుతుంటంతో పలువురు కిందపడి గాయాలపాలవుతున్నారు. ఇక రోడ్లపై చిన్నపిల్లలు కన్పిస్తే కుక్కలు వెంటపడి తరుముతున్నాయి. గతంలో అమీర్ పేటలో ఓ స్కూల్ విద్యార్థులపై ఓ పిచ్చికుక్క దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఇక కిందటి మే నెలలోనూ బోడుప్పల్‌ లోని చంగిచర్లలో ఓ ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తున్న అధికారులు మొద్దునిద్ర వీడకపోవడం శోచనీయంగా మారింది.

ప్రతీరోజు కుక్క కాటుకు గురై పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో రేబీస్ టీకాలు కూడా అందుబాటులో ఉండటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దృష్టిసారించి వీధికుక్కల బారి నుంచి నగరాన్ని కాపాడాలని గ్రేటర్ వాసులు కోరుతున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular