Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. పంథా మార్చనున్న గులాబీ బాస్..!
టీపీసీసీ చీఫ్ ప్రకటనపై కాంగ్రెస్ లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా టీపీసీసీ చీఫ్ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. అయితే అలాంటిదేమీ జరుగలేదు.
టీపీసీసీ పదవీ కోసం కాంగ్రెస్ లోని సీనియర్లంతా పోటీపడుతుండటంతో అధిష్టానం అభిప్రాయ సేకరణ చేపట్టింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాకూర్ సుమారు 160మంది కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి నివేదించారు.
టీపీసీసీ రేసులో ప్రముఖంగా ఎంపీలు రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు విన్పించాయి. కాంగ్రెస్ నేతకే టీపీసీసీ పదవీ ఇవ్వాలని నేతలు పట్టుబడుతుండటంతో అనుహ్యంగా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు తెరపైకి వచ్చింది.
Also Read: చంద్రబాబు సంచలనం: మూడు రాజధానులకు ప్రజలు ఓటేస్తే రాజకీయ సన్యాసం
అయితే తాజాగా శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే టీపీసీసీ రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లే కన్పిస్తోంది. అధిష్టానం టీపీసీసీ ఎవరికీ ఇచ్చినా అందరం కలిసి పని చేస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక టీఆర్ఎస్.. బీజేపీలు రెండు ఒకటేనని వ్యాఖ్యానించారు.
టీపీసీసీ రేసు చివరి దశకు చేరుకున్న సమయంలో నేతల పోటీ చూసిన అధిష్టానం ప్రస్తుతానికి చేతులెత్తేసింది. నూతన సంవత్సరం కొత్త పీసీసీ ప్రకటన వస్తుందని తేల్చిచెప్పింది. ఇప్పటికే పీసీసీపై శ్రీధర్ బాబుకు క్లారిటీ రావడంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కన్పిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్