
డాక్టర్ కొడుకు.. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు.. కానీ రైతు కొడుకు మాత్రం రైతు కాడు.. ఏదో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లేదా ఏదైనా పెద్ద జాబులు చేస్తాడు.. అందరూ అలాగే పోతే ఇక వ్యవసాయం ఎవరు చేస్తారు? మనకు తిండి ఎలా అనే కాన్సెప్ట్ తో రూపొందిందిన మూవీ ‘శ్రీకారం’.
హీరో శర్వానంద్ మరో మంచి సబ్జెక్ట్ తో మన ముందుకు వస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా నూతన దర్శకుడు బి.కిశోర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘శ్రీకారం’.. 14 రీల్స్ పతాకంపై గోపి, రామ్ అంచంటలు నిర్మించారు.ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్.
ఈ సినిమాను మార్చి 11న శివరాత్రి సందర్భంగా విడుదల చేయనున్నారు. తాజాగా ‘శ్రీకారం’ ట్రైలర్ ను విడుదల చేశారు. హీరోలు నాని, నితిన్, వరుణ్ తేజ్ లు కలిసి ఈ ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే వ్యవసాయం కోసం అమెరికాలో గొప్ప సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి మరీ వచ్చిన ఓ యువకుడు పడ్డ కష్టాలు చూపించారు. అందరూ వ్యవసాయం వద్దనుకుంటే దాన్ని యుద్ధంలా చేసి లాభాల పంట పండించిన యువరైతు పాత్రలో శర్వానంద్ జీవించాడు. ఈ సినిమాలోని డైలాగులు, సీన్లు ఆకట్టుకున్నాయి. సందేశాత్మక అంశాలతో తీసిన ఈ చిత్రం ట్రైలర్ ను కింద చూడండి.