Homeఅత్యంత ప్రజాదరణSurviving Sea Dragon Skeleton: బయటపడిన సముద్ర డ్రాగన్ అస్తిపంజరం.. 30 అడుగుల పొడవు.. తల...

Surviving Sea Dragon Skeleton: బయటపడిన సముద్ర డ్రాగన్ అస్తిపంజరం.. 30 అడుగుల పొడవు.. తల బరువు ఒక టన్ను..!

Surviving Sea Dragon Skeleton: పూర్వం భూమిపై జరిగిన అనేక అద్భుతాలు, విచిత్రమైన జంతుజీవరాశుల ఉనికిని కనుగొనేందుకు, నిధుల కోసం ప్రతి దేశం సర్వేలు చేస్తుంటుంది. ఆ పనిని ఆర్కేయాలజీ విభాగం వారు చూస్తుంటారు. కొన్ని బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాల్లో పరిశోధనలు, తవ్వకాలు జరుపుతుంటారు. అలాంటి సమయంలో కొన్ని అద్బుతమైన వింతలు, విశేషాలు బయటపడతాయి. తాజాగా ఇలాంటి అరుదైన ఘటనే ఒకటి చేసుకుంది. సముద్రపు డ్రాగన్ అని పిలవబడే భారీ జంతు శిలాజం ఒకటి బయటపడింది. ఇది సుమారు 18కోట్ల ఏళ్ల కిందటిదని బ్రిటన్ సైంటిస్టులు గుర్తించారు.
Surviving Sea Dragon Skeleton
Surviving Sea Dragon Skeleton

బ్రిటన్‌లోని మిడ్‌ల్యాండ్ ప్రాంతంలో 180 మిలియన్ ఏళ్ల కిందటి ‘సీ డ్రాగన్’(ఇచ్థియోసార్) అస్తిపంజరం బయటపడటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలో భూమిపై డైనోసార్స్ జీవించి ఉన్నాయనడానికి ఇది మరోక సజీవ సాక్ష్యం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సీ డ్రాగన్ చూసేందుకు డాల్ఫిన్ లాగా 30 అడుగుల పొడవు ఉంది. దీని పుర్రె బరువు 1 టన్ను ఉందట.. దీనిని 48 ఏళ్ల జో డేవిస్ ఫిబ్రవరి 2021లో కనుగొన్నారట..

Also Read: శివ మూవీతో టాలీవుడ్‌లో ఎన్ని మార్పులు వ‌చ్చాయో తెలుసా.. హీరో పాత్ర నుంచి క‌థ‌ల వ‌ర‌కు..

గతంలో రట్‌ల్యాండ్ జలాల దగ్గర దొరికిన నీటి డ్రాగన్ 82 అడుగుల వరకు ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇచ్థియోసార్‌లకు చాలా పెద్ద దంతాలు, కళ్ళు ఉన్నందున వాటిని సముద్ర డ్రాగన్‌లు అని పిలుస్తారట. ఇచ్థియోసార్లను ఫస్ట్ టైం 19వ శతాబ్దంలో మేరీ అన్నింగ్ అనే పురావస్తు సైంటిస్టు కనుగొన్నారు. ఈ సముద్ర జీవిపై డాక్టర్ డీన్ లోమాక్స్ చాలా పరిశోధనలు చేశారు. ఇచ్థియోసార్‌లు 250 మిలియన్ ఏళ్ల కిందట భూమిపై ఉనికిలోకి వచ్చాయి.

90 మిలియన్ ఏళ్ల కిందట ఇవి అంతరించిపోయాయి. సాధారణంగా సీ డ్రాగన్ పొడవు 55 అడుగుల వరకు ఉంటుందని సైంటిస్టుల అంచనా.. 240 మిలియన్ ఏళ్ల కిందట వీటి ఉత్పత్తి వేగంగా పెరిగిందని పరిశోధనలో తేలింది. కేవలం దీని తలను కొలిచినప్పుడు 6.5 అడుగులుగా ఉందట.. డైనోసార్లు అంతరించిపోయే క్రమంలో ఇచ్థియోసార్‌లు తిమింగలాల కంటే చాలా వేగంగా తమ పరిమాణాన్ని పెంచుకున్నాయట..తాజాగా వెలుగుచూసిన శిలాజం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చని అమెరికా ఆక్వాటిక్ పరిశోధకుడు లార్స్ ష్మిత్జ్ వెల్లడించారు.

Also Read: వరుణ్ తేజ్‌ తో తమన్నా రొమాన్స్.. ఇది నిజంగా సర్ ప్రైజే !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] RGV: ఆయ‌న అంతే.. ఎప్పుడు ఏం చేస్తారో ఎవ‌రూ ఊహించ‌లేరు. మొన్న‌టికి మొన్న టికెట్ల రేట్ల విష‌యంలో మంత్రి పేర్నినానితో చ‌ర్చించి సంతృప్తి చెందిన‌ట్టు మాట్లాడిన వ‌ర్మ‌.. తెల్లారే ప్లేటు ఫిరాయించేశారు. వైసీపీ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌ల బాణాలు కురిపిస్తున్నారు. ఇంత‌కు ఆయ‌నెవ‌రో ఇప్ప‌టికే అర్థం అయి ఉంటుంది క‌దా. ఆయ‌నేనండి రామ్ గోపాల్ వ‌ర్మ‌. టికెట్ల రేట్ల విష‌యంలో ఆయ‌న ఎంట‌ర్ అయిన‌ప్ప‌టి నుంచి తీవ్ర ఆస‌క్తి నెల‌కొంటోంది. […]

  2. […] Corona: ఇప్పుడు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా విష‌యంలో ప్ర‌భుత్వాలు చెబుతున్న వాటికి, పాటిస్తున్న వాటికి అస్స‌లు పొంత‌న ఉండ‌ట్లేదు. చెప్పే విష‌యాల‌కు, వాస్త‌వ ప‌రిస్థితుల‌కు అస్స‌లు పొంత‌న ఉండ‌ట్లేదు. ఆస్ప‌త్రుల్లో అన్ని ర‌కాల వైద్య స‌దుపాయాలు, అత్యాధునిక టెక్నాల‌జీ ట్రీట్ మెంట్‌ను ఏర్పాటు చేశామ‌ని చెబుతోంది వైసీపీ ప్ర‌భుత్వం. కానీ మంత్రుల‌కు లేదా ఎమ్మెల్యేల‌కు క‌రోనా వ‌స్తే మాత్రం ఇంత‌కు ముందు వెంట‌నే హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రికి ప‌రుగులు తీసేవారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular