https://oktelugu.com/

తల్లి కాబోతున్న హీరోయిన్.. మరి సినిమాల పరిస్థితి ?

సీనియర్ హీరోయిన్ అందాల భామ ‘శ్రియ’ తల్లి కాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఆమె తల్లిగా మారుతున్నదనే విషయాన్ని ఇంకా శ్రీయా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. ఇక దాదాపు దశాబ్ద కాలంగా గ్లామర్ హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామకి వయసు పై పడటంతో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి. అయినా […]

Written By:
  • admin
  • , Updated On : April 5, 2021 / 06:06 PM IST
    Follow us on


    సీనియర్ హీరోయిన్ అందాల భామ ‘శ్రియ’ తల్లి కాబోతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే ఆమె తల్లిగా మారుతున్నదనే విషయాన్ని ఇంకా శ్రీయా అధికారికంగా ప్రకటించలేదు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని నెలలు వేచి ఉండాల్సిందే. ఇక దాదాపు దశాబ్ద కాలంగా గ్లామర్ హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామకి వయసు పై పడటంతో ఈ మధ్య అవకాశాలు తగ్గాయి.

    అయినా సరే ఫుల్ కాంపిటీషన్ లో వరుస ఛాన్స్ లను అందుకోవడానికి  మరింత గ్లామర్ గా రెడీ అయి ఛాన్స్ ల కోసం తెగ తాపత్రయ పడుతుంది ఈ సీనియర్ హీరోయిన్. ఈ క్రమంలో సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ ఉంది. ఆ అందిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్న శ్రియ.. ఇప్పుడు తల్లి కాబోతుంది కాబట్టి మరి సినిమాలకు గ్యాప్ ఇస్తోందేమో చూడాలి. అయితే ప్రస్తుతం శ్రీయా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరి మూడు నెలల లోపు ఈ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది.

    కాగా ఈ సీనియర్ హీరోయిన్ అనుకున్న టైంకి సినిమాలు పూర్తి చేస్తోందా ? అయితే, శ్రియ ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు రీసెంట్ గా ఓకే చెప్పింది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీయ పోలీస్ ఆఫీసర్ గా నటించడానికి అంగీకరించింది. మరి ఈ సినిమా మొదలుపెట్టడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుందట. ఇప్పుడు నిజంగానే శ్రీయా తల్లి కాబోతుంది అంటే.. ఇక ఈ సినిమా ఆగిపోయినట్టే. పాపం చెక్ ప్లాప్ తరువాత చంద్ర శేఖర్ యేలేటి ఎంతో ప్లాన్ చేసుకుని ఈ సినిమా సెట్ చేసుకున్నాడు.