ఆన్ లైన్ యాప్స్ లో రుణాలు తీసుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్..?

ఈ మధ్య కాలంలో కొన్ని ఆన్ లైన్ యాప్స్ సులభంగా రుణాలు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. ఎక్కువ వడ్డీలతో స్టూడెంట్స్ కు, ఉద్యోగులకు రుణాలు ఇస్తున్న ఆన్ లైన్ యాప్స్ సకాలంలో రుణం తీర్చలేకపోతే మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ యాప్ ల ద్వారా రుణాలు పొందిన వాళ్లు అధిక వడ్డీలతో డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. Also Read: ఆ ఇంటి ముందు 42 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్.. […]

Written By: Kusuma Aggunna, Updated On : December 4, 2020 12:39 pm
Follow us on

ఈ మధ్య కాలంలో కొన్ని ఆన్ లైన్ యాప్స్ సులభంగా రుణాలు ఇస్తామంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. ఎక్కువ వడ్డీలతో స్టూడెంట్స్ కు, ఉద్యోగులకు రుణాలు ఇస్తున్న ఆన్ లైన్ యాప్స్ సకాలంలో రుణం తీర్చలేకపోతే మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ యాప్ ల ద్వారా రుణాలు పొందిన వాళ్లు అధిక వడ్డీలతో డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Also Read: ఆ ఇంటి ముందు 42 మంది ఫుడ్ డెలివరీ బాయ్స్.. అసలేం జరిగిందంటే…?

5 వేల రూపాయల లోన్ పదిహేను రోజుల్లో చెల్లిస్తే ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని ఎటువంటి పత్రాలు అవసరం లేకుండానే లోన్లు ఇస్తామని ఆన్ లైన్ యాప్ సంస్థలు చెబుతున్నాయి. బ్యాంకుల్లో రుణం తీసుకోవాలంటే ఎన్నో నిబంధనలు ఉండటంతో చాలామంది ఆన్ లైన్ యాప్ లపై ఆధారపడుతున్నారు. సకాలంలో రుణం చెల్లించని వారిని ఆన్ లైన్ యాప్ సంస్థలు మానసిక వేదనకు గురి చేస్తూ ఉండటం గమనార్హం.

Also Read: విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త.. ఆ సర్వీసులు పెంపు..?

ఈ మధ్య కాలంలో పోలీసులకు సైతం ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో 30 వేల రూపాయలు రుణం తీసుకున్న లక్ష్మన్ అనే వ్యక్తి సదరు సంస్థకు లక్షన్నర రూపాయలు చెల్లించాడు. అయినా వేధింపులు ఆగకపోవడంతో లక్ష్మణ్ పోలీసులను ఆశ్రయించి రుణం ఇచ్చిన యాప్ గురించి ఫిర్యదు చేశాడు. కొందరు సైబర్ మోసగాళ్లు యాప్ లను తయారు చేసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

ఈ యాప్ ల నిర్వాహకులు ఎటువంటి పూచీకత్తు లేకుండా లోన్ ఇస్తారు. అయితే మొబైల్ లోని కాంటాక్ట్స్ వివరాలు అవతలి వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా లోన్ చెల్లించడంలో విఫలమైతే కాంటాక్ట్ లోని నంబర్లకు ఫోన్ చేసి వాళ్ల నుంచి డబ్బులను వసూలు చేస్తున్నారని సమాచారం.