https://oktelugu.com/

ఆ హత్యల వెనుక విస్తుపోయే నిజాలు

విశాఖ జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్యకు సంచలనంగా మారింది. జుత్తాడలో జరిగిన ఉదంతంలో అదే గ్రామానికి చెందిన అప్పలరాజు ఈ హత్యలకు పాల్పడ్డాడు. ఆరుగురిని హత్యలు చేసిన వెంటనే నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అప్పుడప్పుడే నిద్రలేచిన ఆ కుటుంబ సభ్యులందరినీ అప్పలరాజు అతి దారుణంగా కత్తితో నరికి చంపాడు. నెలల వయసున్న చిన్నారిని సైతం కత్తితో దారుణంగా నరికి చంపడంతో విషాదం అలుముకుంది. అయితే.. పాత కక్షలు, ప్రతీకారమే ఈహత్యలకు కారణంగా తెలుస్తోంది. గతంలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 16, 2021 / 02:34 PM IST
    Follow us on

    విశాఖ జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్యకు సంచలనంగా మారింది. జుత్తాడలో జరిగిన ఉదంతంలో అదే గ్రామానికి చెందిన అప్పలరాజు ఈ హత్యలకు పాల్పడ్డాడు. ఆరుగురిని హత్యలు చేసిన వెంటనే నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అప్పుడప్పుడే నిద్రలేచిన ఆ కుటుంబ సభ్యులందరినీ అప్పలరాజు అతి దారుణంగా కత్తితో నరికి చంపాడు. నెలల వయసున్న చిన్నారిని సైతం కత్తితో దారుణంగా నరికి చంపడంతో విషాదం అలుముకుంది. అయితే.. పాత కక్షలు, ప్రతీకారమే ఈహత్యలకు కారణంగా తెలుస్తోంది. గతంలో తన కూతురికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకనే అప్పలరాజు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది.

    జుత్తాడకు చెందిన జమ్మిడి రమణ (53).. అదే గ్రామానికి చెందిన అప్పల రాజు కుటుంబానికి మధ్య ఏళ్లుగా వైరం నడుస్తోంది. అప్పలరాజు కూతురిపై రమణ కుమారుడు విజయ్ కిరణ్ అత్యాచారానికి పాల్పడ్డాడన్న అభియోగంతో ఏప్రిల్,2018లో విజయ్ కిరణ్‌పై కేసు నమోదైంది. అప్పలరాజు కుమార్తెను ఇంటికి పిలిచి టీ, కాఫీ, కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి.. పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా విజయ్ కిరణ్‌పై ఆరోపణలున్నాయి. అలా ఆమెను ఎనిమిది నెలల పాటు వేధించాడన్న ఆరోపణలు ఉన్నాయి.

    అంతేకాదు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన సమయంలో ఫొటోలు తీసి.. విజయ్‌ కిరణ్ భార్య ఉషారాణి తమ నుంచి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు అప్పట్లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అప్పలరాజు పేర్కొన్నారు. వీరే కాకుండా మరో నలుగురితో తమను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. ఇదే క్రమంలో విజయ్‌ కిరణ్‌ భార్య ఉషారాణి కూడా రివర్స్‌ కేసు ఫైల్‌ చేసింది. పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో అప్పలరాజుపై ఫిర్యాదు చేసింది. తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని.. తన భర్త విజయ్‌ కిరణ్‌ను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులు పేర్కొంది.

    దీంతో అప్పటి నుంచి అప్పలరాజు కిరణ్‌ కుటుంబంపై పగ పెంచుకుంటున్నాడు. తన కూతురికి అన్యాయం చేసిన వాడిని వదిలేది లేదని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా.. గురువారం తెల్లవారుజామున అప్పలరాజు నిద్రలేచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రమణ ఇంటివైపు కన్నేశాడు. విజయవాడలో ఉంటున్న రమణ కుటుంబ సభ్యులు విజయ్‌ కిరణ్‌ ఇంటికి వచ్చినట్లుగా తెలుసుకున్నాడు. ఆ వెంటనే చేతిలో కత్తి పట్టుకొని ఆ ఇంటి వైపు వెళ్లాడు. వాకిలి ఊడుస్తున్న విజయ్‌ కిరణ్‌ భార్య ఉషారాణి (30)పై ముందుగా దాడి చేశాడు. ఆమె మెడపై నరకడంతో అక్కడికక్కడే చనిపోయింది. తదుపరి ఇంట్లోకి వెళ్లిన అప్పలరాజు విజయ్‌ కిరణ్‌ తండ్రి రమణ, అతని మేనత్తలు రమదేవి, అరుణ, పిల్లలు ఉదయ్‌, కుమార్తె లిషితను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు.