ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ ‘పంచాయితీ’ తెగడం లేదు. నిర్వహించాలని నిమ్మగడ్డ.. కుదరదని ఏపీ సర్కార్ పంతం పట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబు నియమించిన నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఏపీలో నిర్వహించే ప్రసక్తే లేదని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారు.
Also Read: అభ్యర్థి ఎవరైనా సపోర్టు చేయాలంట..!
ఇటీవలే ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు షాక్ తగిలింది. ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. శనివారం నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అత్యవసరంగా విచారించాలని కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ వేసింది.
అయితే జగన్ సర్కార్ వేసిన పిటీషన్ విచారణ జరగకుండానే ట్విస్ట్ నెలకొంది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉందని.. దాన్ని సరిచేయాలని వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పిటీషన్ వెనక్కి వచ్చేసినట్టు సమాచారం. మళ్లీ ఈరోజే రిజిస్ట్రీ పిటీషన్ ను సరిచేసి దాఖలు చేయవచ్చని వైసీపీ లాయర్లు చెబుతున్నారు.
Also Read: వాట్సాప్ వాడేవాళ్లకు అలర్ట్.. ఈ మెసేజ్ లతో జాగ్రత్త..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు శనివారం నాడే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ రెడీ అయ్యారు. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడడంతో ఇదే అదనుగా ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేస్తున్నాయి.
అయితే ఎన్నికలు ఎలాగైనా ఆపాలని చూస్తున్న జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్